English   

దేవుడు వరమందిస్తే హిట్ వస్తుందా తేజూ...

Sai-Dharam-tej

హ్యాట్రిక్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్స్ తో ఒక్కసారిగా డౌన్ అయిపోయిన మెగా కుర్రాడు సాయి ధరమ్ తేజ్. డ్యాన్సులు బా చేస్తున్నాడు. మంచి ఈజ్ ఉంది అనే పేరు తెచ్చుకున్న తేజూ.. వరుసగా మూడు హిట్లు కొట్టేసరికి ఏకంగా సుప్రీమ్ హీరో అనేశారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేకపోయింది. కథల ఎంపికలో తిక్క చూపించడంతో బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలవలేకపోయాడు. నక్షత్రంలా మెరవాలని ట్రై చేసినా కుదర్లేదు. ఓ స్టార్ డైరెక్టర్ తో కలిసి ఇంటెలిజెంట్ లా ప్రూవ్ చేసుకోవాలన్నా అభాసుపాలయ్యాడు. దీంతో తేజూ కెరీరే కాదు.. ఫేస్ కూడా చాలా డల్ అయిపోయింది. కానీ ఆశ్చర్యంగా అతనికి ఆఫర్స్ ఆగలేదు. ప్రస్తుతం అతను మూడు సినిమాలు చేస్తున్నాడు. మరోటి లైన్లో ఉంది. 

ప్రస్తుతం తేజూ.. కరుణాకరన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి టైటిల్ గా ఓ హిట్ సాంగ్ లైన్ అనుకుంటున్నారు. అదే దేవుడు వరమందిస్తే. యస్.. తేజూ కొత్త సినిమా టైటిల్ గా ఇదే అనుకుంటున్నారని టాక్. దేవుడు వరమందిస్తే అనేది అప్పట్లో వచ్చిన సెన్షేషనల్ యూత్ ఫుల్ మూవీ సిక్స్ టీన్స్ లోని పాట. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఆ రోజుల్లో మంచి విజయం సాధించింది. ఘంటాడి కృష్ణ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్. ముఖ్యంగా దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే అనే పాట డూపర్ హిట్. ఇప్పుడీ లైన్ నే కరుణాకరన్ సినిమాకు పెట్టాలనుకుంటున్నారు. పాట హిట్ అయిందని కాదు కానీ.. ఈ టైటిల్ కరుణాకరన్ సినిమాల్లాగా కాస్త మంచి ఫీల్ నిస్తోంది. చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీని క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మిస్తున్నాడు. మళయాల స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలో తేజూ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. మరి దేవుడు వరమందిస్తేతో అయినా తేజూకు హిట్ అందుతుందేమో చూడాలి.

More Related Stories