English   

తేజూ సినిమాకి గుమ్మడి కాయ కొట్టేశారు 

Sai Dharam Tej
2020-09-12 09:33:09

దాదాపు అరడజను సినిమాల ఫ్లాప్లు కొట్టాక చిత్రలహరి అనే సినిమా ద్వారా మెగా మేనల్లుడు తేజూ మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. ఆ తరువాత తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే సినిమా ద్వారా మరో హిట్ కొట్టి మళ్ళీ మార్కెట్ లో నిలబడ్డాడు. ఇప్పుడు మనోడు హీరోగా సోలో న్రతుకే సో బెటరూ అనే సినిమా తెరకెక్కుతోంది. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పుడు ఈ కరోనా వలన అంతా అప్సెట్ అయింది. అయితే ఈ సినిమా షూట్ అంతా పూర్తి అయిందని అనుకున్నా కొద్దిరోజుల క్రితం షూట్ కి వెళ్లి షాకిచ్చింది యూనిట్.  ఇక ఈ సినిమా టీజర్ అలానే పాటలతో మంచి మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈరోజుతో ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేశారు యూనిట్.  లాక్ డౌన్ వల్ల మిగిలి ఉన్న కాస్త షూట్ వర్క్ ను ఇప్పుడు పూర్తి చేసేసి ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్తామని యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాతో డెబ్యూ దర్శకుడిగా సుబ్బు నిక్కీ పరిచయం కానుండగా నభా నటేష్ ఈ సినిమాలో తేజ సరస్నా హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 

More Related Stories