English   

ఎమోషనల్ అయిన ధరమ్ తేజ్

sai
2019-05-19 11:18:48

ఆరు ఫ్లాపుల తర్వాత మళ్ళీ చిత్రలహరితో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల నుండి సక్సెస్ కోసం చాలా ఎదురు చూసి చిత్రలహరితో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా 15 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 12.60 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాని ఈ మధ్యనే అమెజాన్‌ ప్రైమ్‌ లోనూ విడుదల చేశారు. అయితే అమెజాన్‌ లో చిత్రాన్ని చూసిన వారు సినిమా యూనిట్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ధరమ్‌ తేజ్ నటనని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటిని చూసిన తేజ్ అలా అందరూ తనను అభినందిస్తుంటే కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా పేర్కొన్న తేజ్ ఇప్పుడు నేను విభిన్నమైన ఎమోషన్‌లో ఉన్నానని ఈ ట్వీట్లు చూస్తుంటే సినిమా ఇప్పుడే విడుదలైన భావన కలుగుతోందని ప్రేక్షకులు సినిమా చూసి రివ్యూ రాసినట్లు అనిపిస్తోందని అయన పేర్కొన్నారు. పైరసీని ప్రోత్సహించకుండా ఎదురు చూసి మరీ అమెజాన్‌లో చూసిన వారందరికీ థాంక్స్ అని తేజ్ ట్వీట్‌ చేశారు.  

More Related Stories