English   

కంపౌండ్ దాటాక సాయికి చుక్క‌లే.. 

Sai-Dharam-Tej
2018-07-08 12:57:18

మెగా మేన‌ల్లుడుగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. ఊహించిన దానికంటే వేగంగానే స్టార్ గా ఎదిగాడు సాయిధ‌రంతేజ్. ఈయ‌న కెరీర్ ఇంత స్పీడ్ గా ఎదిగింది అంటే కార‌ణం దిల్ రాజు. మెగా కుటుంబం కూడా సాయి గురించి అంత‌గా ఆలోచించారో లేదో గానీ దిల్ రాజు మాత్రం మెగా మేన‌ల్లుడి చేయి ప‌ట్టుకుని కెరీర్ లో ఓన‌మాలు దిద్దించాడు. ఓ ర‌కంగా సాయి కెరీర్ కు దిల్ రాజే గాడ్ ఫాద‌ర్. ఆయ‌న ఇంటి వాళ్ల కంటే దిల్ రాజు సాయిని ఎక్కువ ఆద‌రించాడు. వ‌ర‌స సినిమాలు ఇచ్చాడు.. అత‌డికి వ‌చ్చిన మూడు విజ‌యాలు దిల్ రాజు ఇచ్చిన‌వే. 

ఎప్పుడైతే దిల్ రాజు కంపౌండ్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాడో అప్ప‌ట్నుంచీ సాయిధ‌రంతేజ్ కు ప్లాపులు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌స‌గా అర‌డ‌జ‌న్ ఫ్లాపులు ఇచ్చాడు ఈ హీరో. ఇప్పుడు విడుద‌లైన తేజ్ ఐ ల‌వ్ యు కూడా ఫ్లాప్ దిశ‌గా అడుగేస్తుంది. ఇప్పుడు కానీ మ‌రో హిట్ రాక‌పోతే సాయి కెరీర్ ముగియ‌డం ఖాయం. దిల్ రాజు మ‌ళ్లీ చొర‌వ తీసుకుని సాయి కెరీర్ ను చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఎంతైనా తాను త‌యారు చేసిన ప్రాడ‌క్ట్ క‌దా.. అలా పాడైపోతుంటే చూస్తూ ఊరుకోలేడు. ఇక ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దాగుడుమూత‌లు సినిమాను ముందు నితిన్, శ‌ర్వానంద్ తో అను కున్నా కూడా ఇప్పుడు వ‌రుణ్ తేజ్, సాయిధ‌రంతో చేయాల‌ని చూస్తున్నాడు దిల్ రాజు. ఈ చిత్రంతో మ‌ళ్లీ దిల్ రాజు కంపౌండ్ లోకి అడుగు పెడుతున్నాడు తేజ్. మ‌రి ఇప్పటికైనా మ‌ళ్లీ మ‌నోడి జాత‌కం మారుతుందో లేదో చూడాలిక‌..!

More Related Stories