English   

నో డౌట్.. సాయిలో ఏదో మ్యాజిక్ ఉంది..

sai dharam tej
2018-02-23 15:42:41

ఇంత‌కీ ఏ సాయి అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు ఉన్నాడుగా మెగా మేన‌ల్లుడు.. సాయిధ‌రంతేజ్. ఈ హీరో కెరీర్ ఇప్పుడు దారుణంగా మారింది. కానీ ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో మ‌నోడి ఫ్యూచ‌ర్ మాత్రం వెలిగిపోతుంది. చేస్తున్న సినిమాలేవీ పెద్ద సినిమాలు కావు కానీ క‌చ్చితంగా ఏ ఒక్క‌టి క్లిక్ అయినా కూడా మ‌నోడి జాత‌కం మ‌ళ్లీ తిరిగిపోయిన‌ట్లే. ప్ర‌స్తుతం ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఐదు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టికే క‌రుణాక‌ర‌ణ్ తో చేస్తోన్న సినిమా ప‌ట్టాలెక్కించాడు సాయిధ‌రంతేజ్. ఈ సినిమా షూటింగ్ ఈ మ‌ధ్యే మొద‌లైంది. సాయి కూడా సెట్ లోకి అడుగు పెట్టాడు. కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం సాయి ఏ రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ని.. లాభాల్లో వాటా మాత్ర‌మే తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉండ‌గానే చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కూడా ఏరికోరి సాయిధ‌రంతేజ్ నే హీరోగా ఎంచుకున్నాడు. ఈయ‌న సాయితో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ ప్లాన్ చేస్తు న్నాడు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతానికి క‌థ‌పై కూర్చున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కంటే ముందే గోపీచంద్ మ‌లినేనితో సినిమా ప‌ట్టాలెక్కించ‌నున్నాడు సాయిధ‌రంతేజ్. ఈ సినిమా మే నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. డిసెంబ‌ర్ లో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాడు గోపీచంద్. గ‌తంలో ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చిన విన్న‌ర్ డిజాస్ట‌ర్ అయింది. అయినా కూడా మ‌రో ఛాన్స్ ఇచ్చాడు సాయి. ఇక మారుతి కూడా మ‌నోడితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇవ‌న్నీ ఉండ‌గానే ఇప్పుడు మైత్రి మూమీ మేక‌ర్స్ తో కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. నాని కాద‌నుకున్న సినిమా ఇప్పుడు సాయి చేతుల్లోకి వ‌చ్చింది. మొత్తానికి వ‌ర‌స‌గా ఇన్నేసి సినిమాలు చేస్తున్నాడు సాయి. మ‌రి ఇందులో ఏది ఈయ‌న కెరీర్ ను నిల‌బెడుతుందో చూడాలిక‌..!

More Related Stories