English   

అల్లుడుతో మేన‌ల్లుడు గిల్లుడు..

sai-dharam-tej

మెగా వారింట ఇప్పుడు ఆస‌క్తిక‌రమైన పోరుకు రంగం సిద్ధ‌మైంది. అదే ఇంటి నుంచి వ‌స్తున్న ఇద్ద‌రు అల్లుళ్ల మ‌ధ్య బాక్సాఫీస్ పోరుకు అంతా సిద్ధం అవుతుంది. ఒక‌రు అల్లుడు అయితే.. మ‌రొక‌రు మేన‌ల్లుడు. ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఇప్ప‌టికే మేన‌ల్లుడు మాస్ హీరోగా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంటే.. అల్లుడు మాత్రం తొలి అడుగు వేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్ద‌రికి విజ‌యం త‌ప్ప‌నిస‌రి. మూడేళ్లుగా ఒక్క విజ‌యం అంటూ మేన‌ల్లుడు అల్లాడిపోతు న్నాడు. ఇక అల్లుడు కూడా తొలి సినిమాతోనే తానేంటో చూపించాల‌నుకుంటున్నాడు. ఇప్ప‌టికే అర్థ‌మైపోయింది క‌దా అల్లుడు.. మేన‌ల్లుడు క‌థ. ఇక్క‌డ అల్లుడు క‌ళ్యాణ్ దేవ్.. అయితే మేన‌ల్లుడు సాయిధ‌రంతేజ్. 

క‌ళ్యాణ్ తొలి సినిమా విజేత జులై 6న విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. ఆరేళ్ల కింద అదే రోజు ఈగ విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించి.. త‌న కెరీర్ మార్చేసింద‌ని న‌మ్ముతాడు ఆ చిత్ర నిర్మాత సాయి కొర్ర‌పాటి. అందుకే సెంటిమెంట్ గా అదే రోజు ఇప్పుడు విజేత సినిమాను విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు సాయి. రాకేశ్ శ‌శి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాళ‌విక న‌య్య‌ర్ హీరోయిన్. ఇక ఇదే రోజు తేజ్ ఐ ల‌వ్ యూ విడుద‌లవుతుంది. క‌రుణాక‌ర‌ణ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అనుప‌మ హీరోయిన్. కేఎస్ రామారావు నిర్మాత‌. జూన్ 29నే రావాల్సిన ఈ చిత్రం అనివార్య కార‌ణాల‌తో అలా వెళ్లిపోయింది. దాంతో ఇప్పుడు అల్లుడు.. మేన‌ల్లుడు మ‌ధ్య పోరు మొద‌లైంది. మ‌రి ఇందులో ఎవ‌ర్ని గెలుపు వ‌రిస్తుందో చూడాలిక‌..!

More Related Stories