English   

అనిల్ రావిపూడి ప్లాన్ బి.. ఎఫ్ 3 కాకుండా మరో సినిమా..

Sai Dharam Tej
2020-07-09 07:10:52

రాజమౌళి, కొరటాల శివ తర్వాత వరస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఈయన చేసిన ఐదు సినిమాలు కూడా విజయం సాధించాయి. అన్నీ నిర్మాతలకు మంచి లాభాలను తీసుకొచ్చాయి. ఈ ఏడాది మొదట్లో మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాప్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు అనిల్. ఈ సినిమా తర్వాత వరసగా కథలు సిద్ధం చేస్తూనే ఉన్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఈ క్రమంలోనే ఎఫ్ 3 కథ కూడా సిద్ధం చేసాడు. ఈ కరోనా వైరస్ కథ లేకపోయుంటే ఈ పాటికే ఎఫ్ 3 పట్టాలెక్కుండేది. కానీ ఏం చేస్తాం లాక్ డౌన్ కారణంగా ఎఫ్ 3 ఇంకా అలాగే ఉండిపోయింది. మరోవైపు ఈ చిత్రంలో నటించే వరుణ్ తేజ్, వెంకటేష్ కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకటేష్ నటిస్తున్న నారప్ప ఏడాది చివరి వరకు షూటింగ్ జరగనుంది. మరోవైపు వరుణ్ తేజ్ కూడా బాక్సర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యే వరకు కూడా అనిల్ కు వాళ్ల కోసం వేచి చూడటం తప్ప మరో ఆప్షన్ కూడా లేదు. 

అందుకే ఇప్పుడు మరో యంగ్ హీరోతో ఓ చిన్న సినిమా చేయాలని ఈ దర్శకుడు భావిస్తున్నాడు. ఇండస్ట్రీలో వరస విజయాలతో దూసుకుపోతున్న ఓ యంగ్ హీరోతో అనిల్ త్వరలోనే సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనెవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్. ప్రస్తుతానికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే సాయి ధరమ్ తేజ్ తోనే అనిల్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో సుప్రీమ్ సినిమా వచ్చింది. ఈ చిత్రంతోనే సాయి మార్కెట్ 25 కోట్లకు చేరిపోయింది. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు ఈ కుర్ర దర్శకుడు. 

More Related Stories