English   

నా మ‌న‌సే అంటున్న సాయిధ‌రంతేజ్.. 

Sai-dharam-tej

వరస ఫ్లాపులతో ప్ర‌స్తుతం మెగా మేన‌ల్లుడు చాలా క‌ష్టాల్లో ఉన్నాడు. ఈయ‌న సినిమాల‌న్నీ ఇలా వ‌చ్చి అలా వెళ్తున్నాయి. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ఇంటిలిజెంట్ కూడా అడ్ర‌స్ లేకుండా పోయింది. సాయి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచి.. మ‌నోడి ఇమేజ్ ను అమాంతం దించేసింది ఈ చిత్రం. వినాయ‌క్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ కూడా ఏం చేయ‌లేక‌పోయాడు ఈ చిత్రాన్ని. ఇక ఇప్పుడు ఈయ‌న క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యింది. నాన్ స్టాప్ గా రెగ్యులర్ షూటింగ్ జ‌రుగుతుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేయస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ సినిమాకు నా మ‌న‌సే.. ట్యాగ్ లైన్ సే సే సే.. అని పెట్ట‌బోతున్నారు. దేవుడు వ‌ర‌మందిస్తే అంటూ ఆ మ‌ధ్య ఓ ఫేక్ టైటిల్ బ‌య‌టికి వ‌చ్చింది. అది కాద‌ని చిత్ర‌యూనిట్ చెప్పారు. ఇక ఇప్పుడు నా మ‌న‌సే అంటూ మ‌రో టైటిల్ బ‌య‌టికి వ‌చ్చింది. మార్చ్ 30న ఈ టైటిల్ గురించి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుంది. తొలిప్రేమ సినిమాలోని నా మ‌న‌సే అనే పాట అంద రికీ గుర్తుండే ఉంటుంది. అదే పాట‌ను టైటిల్ గా పెడుతున్నాడు క‌రుణాక‌ర‌ణ్. ఈ టైటిల్ అయితే ఫీల్ కూడా అదిరిపోతుంది. పైగా మెగా మేన‌ల్లుడు క‌దా.. ఈజీగానే క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు కూడా. మ‌రి చూడాలిక‌.. ఈయ‌నైనా సాయిధ‌రంతేజ్ కోరుకున్న విజ‌యాన్ని అందిస్తాడో లేదో..? 
 

More Related Stories