English   

మెడిక‌ల్ స్కామ్ లో మెగా మేన‌ల్లుడు.. !!

saidharamtej

సాయిధ‌రంతేజ్ కు హిట్లు లేవు కానీ అవ‌కాశాలు కావు. ఇప్ప‌టికీ ఆయ‌న కోసం క‌థ‌లు రాస్తూనే ఉన్నారు ద‌ర్శ‌కులు. అదేం విచిత్ర‌మో కానీ ఓసారి ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుల‌ను కూడా రా ర‌మ్మంటూ ఆహ్వానిస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ఈ హీరో. దాంతోపాటు నేనుశైల‌జ‌.. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ లాంటి సెన్సిబుల్ సినిమాలు చేసిన కిషోర్ తిరుమ‌ల‌తో సాయి చిత్ర‌ల‌హ‌రి సినిమా చేస్తున్నాడు. దీనికి బార్ అండ్ రెస్టారెంట్ అనేది ట్యాగ్ లైన్. 

ఇందులో సునీల్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దాంతో పాటే గోపీచంద్ మ‌లినేని సినిమా కూడా క‌మిట‌య్యాడు ఈ హీరో. ఇదివ‌ర‌కే ఈ కాంబినేష‌న్ లో విన్న‌ర్ వ‌చ్చింది కానీ గెల‌వ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఈ జోడీ సినిమా చేస్తున్నారు. ఈ సారి మెడిక‌ల్ మాఫియాపై ప‌డుతున్నారు సాయి.. గోపీచంద్ మ‌లినేని. మెడిక‌ల్ సిస్ట‌మ్ లో జ‌రిగే అన్యాయాల్ని హైలైట్ చేస్తూ ఈ క‌థ సిద్ధం చేస్తున్నాడు గోపీచంద్ మ‌లినేని. త్వ‌ర‌లోనే సినిమా మొద‌లు కానుంది. వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే జ‌వాన్ తో ఓ సారి సందేశాలు ఇవ్వ‌బోయి దెబ్బ‌తిన్న సాయి.. ఈ సారి ఏం చేస్తాడో చూడాలిక‌..

More Related Stories