English   

నాని నో అన్నాడు తేజూ యస్ అన్నాడు

nani and sai dharam tej

లక్ అంటే సాయి ధరమ్ తేజ్ దే. వరుసగా సినిమాలు పోతోన్నా దానికి డబుల్ స్పీడ్ తో కొత్త సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే ఐదు సినిమాలు పోయాయి. అయినా అతని చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తేజూ పాకెట్ లో చేరింది. ఈ ఆఫర్ ఎవరి వల్ల వచ్చిందో తెలుసా.. నేచురల్ స్టార్ నాని వల్ల. అదెలా..? అనుకుంటున్నారా..? ఎలాగో మీరే చూడండి.. లక్ లక్కలా అతుకున్న స్టార్ సాయిధరమ్ తేజ్. అందుకే ఇప్పుడు అతని పాకెట్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది. అయితే తేజూ చేజార్చుకున్న హిటో స్టోరీస్ తో కంపేర్ చేస్తే ఇదేమంత పెద్ద మేటర్ కాదు కానీ.. ఇప్పుడు అతని సిట్యుయేషన్ చూసి కూడా ఇన్నేసి ఆఫర్స్ వస్తున్నాయనేదే ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు తేజూ. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా మేలో ప్రారంభం అవుతుంది. ఈ రెండు సినిమాలూ ఈ యేడాదే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇదే టైమ్ లో మరో సూపర్ లవ్ స్టోరీకి సైన్ చేశాడీ ధర్మాభాయ్. ఒకరికి అనుకున్న కథ మరొకరికి షిఫ్ట్ కావడం ఇండస్ట్రీలో మామూలే. ఓ హీరో వదులున్న కథతో మరో హీరో బ్లాక్ బస్టర్ కొట్టడం లేదా డిజాస్టర్ చూడటం కూడా కామనే. అయితే అవన్నీ లక్ మీదే ఆధారపడి ఉంటాయని నమ్ముతుంది ఇండస్ట్రీ. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస సినిమాలు, విజయాలతో దూసుకుపోతున్నాడు. అతనిప్పుడు కృష్ణార్జున యుద్ధం చేస్తున్నాడు. తర్వాత నాగార్జునతో మల్టీస్టారర్. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఆ తర్వాత నేను శైలజ, ఉన్నద ఒకటే జిందగీ ఫేమ్ కిశోర్ తిరుమలతో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ కథలో నాని కొన్ని మార్పులు చెప్పాడట. అందుకు దర్శకుడు ఒప్పుకోలేదు. కట్ చేస్తే కాంబినేషన్ క్యాన్సిల్ అయింది.  ఇప్పుడు అదే కథతో సాయి ధరమ్ తేజ్ ను అప్రోచ్ అయ్యాడు కిశోర్. అసలే మంచి కథల కోసం వేచి చూస్తోన్న తేజూ కిశోర్ తెచ్చిన స్క్రిప్ట్ ను వెంటనే ఒప్పేసుకున్నాడు. సో తేజూ పాకెట్ లో మరో మూవీ చేరిందన్నమాట. ఈ సినిమాకు చిత్రలహరి అనే టైటిల్ అని ముందు నుంచీ వినిపిస్తోంది. అయితే ఇది నానితో అనుకున్న టైటిల్. మరి తేజూకు కూడా ఇదే టైటిల్ తో వెళతారా అనేది చూడాలి. ఏదేమైనా ఈ మూడు సినిమాల్లో ఏ రెండు హిట్ అయినా సాయిధరమ్ తేజ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడు. లేదంటే.. ఇంక చెప్పక్కర్లేదేమో.. 

More Related Stories