English   

నిహారిక‌తో పెళ్లిపై స్పందించిన సాయి..

Sai-Dharam-Tej-Responds-To-Marriage-Rumours-With-Niharika
2017-05-09 05:07:37

మెగా మేన‌ల్లుడు సాయిధ‌రంతేజ్ తో మెగా డాట‌ర్ నిహారిక పెళ్లి జ‌ర‌గబోతుందంటూ కొన్ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇద్ద‌రూ క్లోజ్ గా ఉండ‌టం.. పైగా బావ మ‌ర‌ద‌ళ్లు కూడా కావ‌డంతో ఈ వార్త‌ను నిజమేనేమో అనుకున్నారంతా. పైగా అటు సాయి గానీ.. ఇటు నిహారిక గానీ ఈ విష‌యంపై స్పందించ‌క‌పోవ‌డం వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్నిచ్చాయి. కానీ ఇప్పుడు ఈ వార్త‌ల‌పై మెగా మేన‌ల్లుడు స్పందించాడు.

నిహారిక‌తో త‌న పెళ్లి అంటూ వ‌స్తోన్న వార్త‌ల్ని ఖండించాడు సాయిధ‌రంతేజ్. నిహాతో నాకు పెళ్లేంటి.. అది త‌ప్పుడు వార్త‌లు అంటూ మాట్లాడాడు ఈ మెగా హీరో. మ‌రో రెండు మూడేళ్ల వ‌ర‌కు తాను పెళ్ళి చేసుకోన‌ని.. ప్ర‌స్తుతానికి త‌న దృష్టంతా సినిమాల‌పైనే అని చెప్పాడు ఈ కుర్ర‌హీరో. ప్ర‌స్తుతం బివిఎస్ ర‌వి జ‌వాన్ తో పాటు న‌క్ష‌త్రంలోనూ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు సాయిధ‌రంతేజ్.

More Related Stories