English   

క్రిస్మస్ కి సాయి ధరమ్ తేజ్  సోలో బ్రతుకే సో బెటర్

Sai dharam Tej
2020-11-30 11:03:47

సాయి ధరమ్ తేజ్  హీరోగా నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమాకు సుబ్బు దర్శకత్వం వహించారు. వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీబీఎస్ఎన్ ప్రసాద్ సినిమాను నిర్మించారు. సినిమాలో తేజ్ సరసన నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ మేరకు డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. 

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ... ఈ సంవత్సరం మనం ఎలాంటి పరిస్థితిని ఎదురుకున్నామో మనందరికీ తెలుసు. ఈ సమయంలో ప్రేక్షకులకు వినోదం పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. డిసెంబర్ 25న మా సినిమా థియేటర్లలోలకి రావడం ఆనందంగా ఉంది. అన్ని హంగులతో తెరకెక్కిన మా సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతోంది." అని అన్నారు . ఇక ఈ సినిమాకు థమన్ స్వరాలను అందించారు. గతేడాది కూడా క్రిస్మస్ రోజున "ప్రతిరోజు పాండగే" సినిమాతో వచ్చిన తేజ్ హిట్ కొట్టాడు. ఈ సారి కూడా క్రిస్మస్ సెంటిమెంట్ మెగా అల్లుడికి కలిసి వస్తుందా లేదా చూడాలి.

More Related Stories