English   

అమ్మకు రెండో పెళ్లి...సాయి తేజ్ !

Sai Dharam Tej
2019-04-24 10:59:47

వరుసగా ఆరు ప్లాపులతో ఇబ్బంది పడిన మెగా మేనల్లుడు సాయి తేజ్ ‘చిత్రలహరి’తో హిట్ కొట్టి మళ్లీ ఫాంలోకి వచ్చాడు. తను నటించిన సినిమాలు డిజాస్టర్లయినా క్రుంగకుండా పోరాడి మరీ హిట్ట్ కొట్టాడు. అయితే ఈ హీరో తన పర్సనల్ లైఫ్ గురించి మీడియాతో పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ మనకి తెలియని ఆయన కుటుంబానికి సంబందించిన విషయాలను ఆయన పంచుకున్నాడు. తాను పదో తరగతి చదివేటప్పుడే తమ అమ్మానాన్న విడాకులు తీసుకున్నారని సాయి చెప్పుకొచ్చాడు. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో 15 ఏళ్ల క్రితం వారు విడిపోయారని అన్నాడు. అమ్మానాన్న విడిపోయాక ఆ లోటు తెలియకుండా నన్ను, తమ్ముడిని అమ్మ పెంచి పెద్ద చేసిందని అయితే తమ నాన్నతో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నామని ఆయన ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంతూళ్లో ఉంటున్నారని వెల్లడించాడు. అయితే నాన్నతో విడిపోయాక 2011లో అమ్మ మరో వ్యక్తిని పెళ్లాడిందని, అమ్మను పెళ్లాడిన వ్యక్తి కంటి డాక్టర్ అని, ఆయన చాలా మంచివాడని, అమ్మను బాగా చూసుకుంటారని అన్నాడు. తాను, తమ్ముడు పెళ్లిళ్లు చేసుకుంటే అమ్మ ఒంటరి అవకూదడనే భావనతోనే రెండో పెళ్లికి ఒప్పించామని ఆయన చెప్పుకొచ్చాడు. 

More Related Stories