English   

 తేజ్ ఐ ల‌వ్ యూ ఫ‌స్ట్ టాక్..!

Sai-Dharam-Tej

తేజ్ ఐ ల‌వ్ యూ విడుద‌లైంది.. ఐదు ఫ్లాపుల‌తో డీలా ప‌డిన తేజ్ కు తేజ్ తో ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందా అని అంతా ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం విడుద‌లైంది. ఓవ‌ర్సీస్ టాక్ ప్ర‌కారం చూస్తే ఈ సారి కూడా సాయిధ‌రంతేజ్ కు స‌రైన సినిమా ప‌డ‌లేద‌ని తెలుస్తుంది. మ‌రోసారి అదే పాత క‌థ‌తో వ‌చ్చి ప్రేక్ష‌కుల స‌హ‌నానికి తేజ్ ప‌రీక్ష పెట్టాడ‌ని.. ముఖ్యంగా క‌రుణాక‌ర‌ణ్ అదే ఓల్డ్ ఫార్మాట్ లో సినిమాను తెర‌కెక్కించాంటున్నారు ప్రేక్ష‌కులు. తెలిసిన సీన్లు.. ఇప్ప‌టికే చాలా సినిమాల్లో వాడేసిన సీన్స్ నే మ‌ళ్లీ మ‌ళ్లీ చూపించాడు క‌రుణాక‌ర‌ణ్. ఫ‌స్టాఫ్ లో పెద్ద‌గా క‌థేం లేకుండానే సింపుల్ గా హీరో హీరోయిన్ మ‌ధ్య డార్లింగ్ త‌ర‌హాలో ఓ చిన్న గేమ్ ప్లేతో న‌డిపించాడ‌ని.. సెకండాఫ్ లో క‌థ విలేజ్ కు షిఫ్ట్ అయి అక్క‌డ కూడా అవే పాత స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో  బోర్ కొట్టించాడంటున్నారు. అయితే సాయి, అనుప‌మ మ‌ధ్య కామెడీ సీన్స్ మాత్రం బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ని.. అక్క‌డ‌క్క‌డా కొన్ని సీన్స్ బాగా ల్యాగ్ అయ్యాయంటున్నారు ప్రేక్ష‌కులు. ఓవ‌ర్సీస్ ఆడియన్స్ టాక్ ప్ర‌కారం మ‌రోసారి సాయిధ‌రంతేజ్ కు యావ‌రేజ్ సినిమానే వ‌చ్చింది. మ‌రి ఇండియాలో ఎలాంటి రెస్పాన్స్ తో తేజ్ ఓపెన్ అవుతాడో చూడాలిక‌..!

More Related Stories