English   

తేజ్.. క‌నీసం నీకైనా తెలుస్తుందా..? 

Sai-Dharam-Tej
2018-06-27 13:32:55

ఇప్పుడు సాయిధ‌రంతేజ్ ను చూస్తుంటే ఇదే అడ‌గాల‌నిపిస్తుంది మ‌రి. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఐదు ఫ్లాపులున్నాయి ఈ హీరోకు. అది కూడా వ‌ర‌స‌గా. వాటిని ఫ్లాపులు అనేకంటే డిజాస్ట‌ర్స్ అన‌డం బెట‌ర్. అంత దారుణ‌మైన కెరీర్ గ్రాఫ్ ఉన్న‌పుడు వ‌చ్చే సినిమా ఎలా ఉండాలి..? క‌నీసం కొత్త క‌థ లేక‌పోయినా కూడా ఏదో ట్రైల‌ర్ లో అయినా క‌నీసం కొత్త‌ద‌నం క‌నిపించాలి క‌దా..? ఇప్పుడు ఈయ‌న న‌టించిన తేజ్ ఐ ల‌వ్ యూ ట్రైల‌ర్ చూస్తే కొత్త‌ద‌నం మాట ప‌క్క‌న‌బెడితే తేజ్ కు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు మాత్రం త‌ప్ప‌డం లేదు. అస‌లు నిజంగా తేజ్ తెలివితో ఉన్న‌పుడే క‌రుణాక‌ర‌ణ్ ఈ క‌థ చెప్పాడా లేదంటే నిద్ర పోయిన‌పుడు చెప్పి ఒప్పించాడా అనే అనుమానం అయితే రాక‌మానదు. ట్రైల‌ర్ విడుద‌లై ఒక రోజు గ‌డిచినా కూడా ఎక్క‌డా ఊహించిన రెస్పాన్స్ అయితే రావ‌డం లేదు. పైగా ట్రైల‌ర్ లో అన్నీ రిపీట్ షాట్స్ క‌నిపించాయి. ముఖ్యంగా డార్లింగ్.. వాసు.. ఎందుకంటే ప్రేమంట‌తో పాటు ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా స్ప‌ష్టంగా క‌నిపించింది. క‌రుణాక‌ర‌ణ్ త‌న పాత సినిమాల‌న్నీ మ‌ళ్లీ క‌లిపి మిక్సీలో వేసి ఓ క‌థ రాసి ఇప్పుడు తేజ్ తో తేజ్ ఐ ల‌వ్ యూ అని తీసాడా అనిపిస్తుంది ఈ ట్రైల‌ర్ చూస్తుంటే. ఇదిలా ఉంటే వాసులో మ్యూజిక్ బ్యాండ్.. ఎందుకంటే ప్రేమంట‌లో హీరోతో హీరోయిన్ ఆడుకునే సీక్వెన్స్.. డార్లింగ్ లో మోసం చేసే బ్యాక్ డ్రాప్.. తొలిప్రేమ‌లో ఫ్యామిలీ సీన్స్.. ఒక్క‌సారి అన్నీ క‌లిపి చూస్తే అదే తేజ్ ఐల‌వ్యూ ట్రైల‌ర్. మ‌రి ఈ కంటెంట్ తో తేజ్ కోరుకున్న విజ‌యం వ‌స్తుందా..? ఏమో జులై 6న దీనికి స‌మాధానం దొరుకుతుంది. 

More Related Stories