English   

తేజ్.. ఫస్ట్ ఫీలింగ్ చెప్పబోతున్నాడు

sai-dharam-tej
2018-04-30 16:55:04

తేజ్.. క్వశ్చన్ మార్క్.. లవ్ యూ.. ఇది సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా టైటిల్. కాకపోతే క్వశ్చన్ మార్క్ ను సింబల్ గానే వేశారు. ఇది చూస్తే ఖచ్చితంగా ఇదో ప్రామిసింగ్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఇక లవ్ స్టోరీస్ ను నెరేట్ చేయడంలో ఇప్పటికే ఎక్స్ పర్ట్ అనిపించుకున్న కరుణాకరన్ దర్శకుడు కావడంతో ఆ తొలిప్రేమ తాలూకూ భావాలు వద్దన్నా వచ్చేస్తుంటాయి. పైగా ఇది మెగా కుర్రాడి సినిమా కదా. వరుసగా హిట్లు కొట్టి సడెన్ గా డిజాస్టర్స్ కు మారిన తేజూకు ఇది ఖచ్చితంగా మళ్లీ బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ఇక కథాబలం ఉన్న సినిమాలతోనే సెట్స్ పైకి వెళ్లే నిర్మాత కెఎస్ రామారావు నిర్మిస్తోన్న సినిమా కాబట్టి.. ఖచ్చితంగా తేజూకి ఇది రీ ఛార్జింగ్ మూవీ అవుతుందనుకోవచ్చు.  సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ టీజర్ రేపు ఉదయం 11.30గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ కు ఫస్ట్ ఫీల్ అనే కొత్త పేరు కూడా పెట్టారు. మరి ఈ ఫీల్ తో తేజ్ లవ్ యూ అనే ఈ సినిమా ఎంత ఫీల్ గుడ్ మూవీ అవుతుందో తెలిసిపోతుందనుకోవచ్చు. 

More Related Stories