English   

సుప్రీమ్ 25 కోట్లు.. ఇంటిలిజెంట్ 4 కోట్లు..!

sai dharam tej
2018-02-21 17:28:40

మూడేళ్ల కింద వ‌చ్చిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాకు తొలిరోజే 5 కోట్ల షేర్ వ‌చ్చింది.. విన్న‌ర్ సినిమాకు కూడా తొలిరోజే 6 కోట్ల‌కు పైగా షేర్ వ‌చ్చింది.. కానీ ఇప్పుడు ఇంటిలిజెంట్ ఫుల్ ర‌న్ లో కూడా 4 కోట్లు రాలేదు. అంటే సాయిధ‌రంతేజ్ ప‌రిస్థితి ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి పడిపోయిందో అర్థ‌మైపోతుంది. రొటీన్ సినిమాలు చేస్తే ప్రేక్ష‌కులు ఎంత‌గా తిప్పి కొడ‌తారో అనేదానికి ఇది పెద్ద నిద‌ర్శ‌నం. ఇన్నాళ్లూ వినాయ‌క్ సినిమాలంటే కాస్తైనా న‌మ్మ‌కం ఉండేది.. సాయిధ‌రంతేజ్ అంటే ఏదో చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఉండేది.. ఒక్క సినిమాతో ఈ రెండూ పోయాయి. ఇంటిలిజెంట్ కు వ‌చ్చిన వ‌సూళ్లు చూస్తుంటే సినిమా ఎంత పెద్ద డిజాస్ట‌రో మాట‌ల్ల కూడా చెప్ప‌లేం. ఎందుకంటే ఆ లెక్క‌లే చెబుతున్నాయి క‌దా. తొలి మూడు రోజుల్లో కేవ‌లం మూడంటే మూడు కోట్లు మాత్ర‌మే తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్ర వ‌సూళ్లు 4 కోట్లు కూడా స‌రిగ్గా రాలేదంటే ఆశ్చ‌ర్యపోక త‌ప్ప‌ని ప‌రిస్థితి.

ఇంక ఓవ‌ర్సీస్ లో అయితే సాయి సినిమా వైపు చూడ్డానికి కూడా భ‌య‌పడుతున్నారు అక్క‌డి ప్రేక్ష‌కులు. అక్క‌డ ఇప్ప‌టికే ఇంటిలిజెంట్ ప్ర‌యాణం ముగిసింది. 30 ల‌క్ష‌ల‌తోనే స‌రిపెట్టుకున్నాడు ఇంటిలిజెంట్. ఊరుపేరు తెలియ‌ని సినిమాలు కూడా ఇంత‌కంటే ఎక్కువ వ‌సూలు చేస్తాయి ఒక్కోసారి. కానీ సాయిధ‌రంతేజ్ లాంటి క్రేజీ హీరో.. వినాయ‌క్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ క‌లిసి కూడా అక్క‌డ ఇంత మాయ కూడా చేయ‌లేక‌పోయారు. అస‌లు కొత్త‌ద‌నం లేని క‌థ‌ను తీసుకొచ్చి.. దానికి మ‌రింత చెత్త స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఏదో టైమ్ పాస్ చేసిన సినిమాలా తెర‌కెక్కించాడు వినాయ‌క్. త‌న బ్రాండ్ పోతుంద‌ని తెలిసి కూడా ఇంత ఎపిక్ డిజాస్ట‌ర్ ఇచ్చాడు. మ‌రోవైపు సాయి ధ‌రంతేజ్ కూడా క‌థ, కాక‌ర‌కాయ్ గురించి ప‌ట్టించుకోకుండా స్టార్ డైరెక్ట‌ర్ అనే ముసుగులో ప‌డిపోయాడు. మొత్తానికి ఇంటిలిజెంట్ ను అమ్మింది అక్ష‌రాలా 27 కోట్లైతే.. వ‌చ్చింది మాత్రం 4 కోట్లే. ఈ లెక్క‌న అజ్ఞాత‌వాసి పెద్ద సినిమాల్లో ఎపిక్ అయితే.. మీడియం సినిమాల వంతును తాను తీసుకున్నాడు మెగా మేన‌ల్లుడు.

More Related Stories