English   

సాయి ధరమ్ తేజ్ సినిమా సంక్రాంతికి రానట్లే..

 Sai Dharam Tej
2019-06-25 08:28:35

చిత్రలహరి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ వరస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే మారుతి దర్శకత్వంలో కొత్త సినిమాకు ముహూర్తం పెట్టాడు మెగా మేనల్లుడు. చాలా రోజుల నుంచి ఈ కాంబినేషన్పై వార్తలు వస్తూనే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. శైలజ రెడ్డి అల్లుడు సినిమా తర్వాత మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఇప్పుడు ఈయన హిట్ కొట్టడం అనివార్యంగా మారింది. మరోవైపు చిత్రలహరి కూడా బ్లాక్ బస్టర్ కాదు కేవలం హిట్ అయింది. దీనికి ముందు ఆరు సినిమాలతో డిజాస్టర్లు ఇచ్చాడు సాయి ధరమ్. అలాంటి సమయంలో వచ్చిన చిత్రలహరి మెగా మేనల్లుడికి ఊరటనిచ్చింది. ఇక ఇప్పుడు మారుతి సినిమాతో విజయం అందుకని మరోసారి పూర్తిస్థాయి ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు ఈ మెగా హీరో. దీనికి ప్రతి రోజు పండగే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

దీని వెనక కూడా ఒక కథ ఉంది. ముందుగా ఈ చిత్రానికి భోగి అనే టైటిల్ అనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే భోగి అని పెట్టినప్పుడు కచ్చితంగా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత భోగి వస్తుంది కాబట్టి అలా ఈ సెంటిమెంట్ కలిసి వస్తుంది అనుకున్నాడు మారుతి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్రాంతికి చాలా సినిమాలు ఉండటంతో సాయి సైలెంట్ గా తప్పుకున్నాడు. ఇక సంక్రాంతికి రానప్పుడు భోగి అనే టైటిల్ పెటడం కుదరని పని అనుకొని ప్రతి రోజు పండగే అనే టైటిల్ కు ఓకే చెప్పేసాడు మారుతి. ప్రతిసారి మనిషిలో ఉన్న ఏదో ఒక క్వాలిటీని తీసుకొని దాని నుంచి కథ అల్లుకునే మారుతి ఈసారి మాత్రం తండ్రీ కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా చూపించబోతున్నాడు. తొలిసారి తన కెరీర్లో పూర్తిగా సెంటిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు మారుతి. ఈయనకు కూడా ఈ సినిమా కీలకమే. వచ్చే ఏడాది మార్చిలో ప్రతి రోజు పండగే విడుదల కానుంది. మరి సంక్రాంతి ని మిస్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్ సమ్మర్లో వచ్చి ఏం చేస్తాడో చూడాలి.

More Related Stories