English   

సాయధరమ్ పై నమ్మకం లేకనే కదా..?

sai dharam tej

 

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ ఫస్ట్ మూవీ వదిలేస్తే తర్వాత హ్యాట్రిక్ హిట్స్ కొట్టి ఫర్వాలేదనిపించుకున్నాడు. పైగా మామయ్య మెగాస్టార్ పోలికలు ఉండటంతో మాస్ ఆడియన్స్ మనోడిని బాగా ఓన్ చేసుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎన్నో సినిమాలక నిలవలేదు. వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు డిజాస్టర్స్ లో. మరోవైపు తేజ్ టైమ్ హీరోలంతా సరికొత్త కథలతో దూసుకుపోతున్నారు. దీంతో ఇకపై హిట్స్ లేకపోతే అతని కెరీర్ ఆల్మోస్ట్ ముగిసినట్టే అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో అలా జరగకుండా ఉండేందుకు తేజ్ అండ్ కో తెగ ప్రయత్నాలు చేస్తున్నారిప్పుడు. అతని లేటెస్ట్ మూవీ ’చిత్రలహరి- ద బార్ అండ్ రెస్టారెంట్’ సినిమా కోసం ద బెస్ట్ టీమ్ ను సెలెక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడీ చిత్రలహరి ప్రాజెక్ట్ లోకి టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఎంటర్ అయ్యాడు. నేను శైలజ హిట్ తో టాలీవుడ్ ను ఆకట్టుకున్న కిశోర్ తిరుమల తెరకెక్కిస్తోన్న సినిమానే ‘చిత్రలహరి- బార్ అండ్ రెస్టారెంట్’. అయితే అతని గత సినిమా ఉన్నది ఒకటే జిందగీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ పై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

అందుకే సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ ఘట్టమనేనిని తీసుకున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీ శ్రీప్రసాద్ ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఏంటంటే.. తేజూ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ సునిల్ ను కూడా తీసుకుంటున్నారని. యస్.. సినిమాలో మేజర్ మెయిన్ పార్ట్ అంతా సునిల్ మోసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. అఫ్ కోర్స్ సునిల్ కమెడియన్ గానే ఉంటాడు.. కాకపోతే కథలో కీలంగా ఉంటాడు. నిజానికి తేజూ సిట్యుయేషన్ బావుంటే.. ఇలాంటి మార్పులు అవసరం ఉండేది కాదని టాక్. అయినా తీసుకుంటున్నారంటే తేజూ పై నమ్మకం లేకనే అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఉంటుందట. కిశోర్ ఫస్ట్ మూవీ తండ్రి కూతురు ఉన్నారు. ఇప్పుడు కూతురు ప్లేస్ లో కొడుకు వచ్చాడు. మరి మిగతాదంతా సేమ్ ఉంటుందా లేక మారుస్తారా అనేది చూడాలి.. అయితే తేజ్ ను కాపాడాలంటే కథలు బావుండాలి కానీ టాప్ టెక్నీషియన్స్ ను తీసుకుంటే కాస్ట్ పెరుగుతుంది కానీ కథలు మెరుగు కావు కదా అనేవారూ ఉన్నారు. 

More Related Stories