English   

 అనిల్ ఆయ‌న‌తో క‌ట్టీఫ్ అయ్యాడా..? 

Sai-Karthik
2018-03-28 11:14:31

ఇండ‌స్ట్రీలో కొంద‌రు ద‌ర్శ‌కులు ఉంటారు. వాళ్లు సినిమా చేస్తుంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు అని అడ‌క్కూడ‌దు. రాజ‌మౌళి సినిమాకు కీరవాణి ఒక్క‌డే ఉంటాడు.. కొర‌టాల సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్.. అలాగే సుకుమార్ కు కూడా దేవీనే.. ఇలా కొంద‌రికి కొంద‌రు ఫిక్స్ అయిపోయుంటారు. అలాగే చిన్న సినిమాల‌కు అనిల్ రావిపూడి అయితే సాయికార్తిక్ అని ఫిక్స్ అయిపోవ‌చ్చు. ప‌టాస్.. సుప్రీమ్.. రాజా ది గ్రేట్ సినిమాల‌కు సాయికార్తిక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ జోడీ విడిపోతుంద‌ని తెలుస్తుంది. అనిల్ రావిపూడి నాలుగో సినిమాకు సాయికార్తిక్ కాకుండా దేవీ సీన్ లోకి వ‌చ్చాడు. అవును.. ఫ‌స్ట్ టైమ్ సాయికార్తిక్ ను కాద‌ని మ‌రో సంగీత ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌రికి వెళ్తున్నాడు అనిల్ రావిపూడి. ఈయ‌న ప్ర‌స్తుతం ఎఫ్ 2 అనే మ‌ల్టీస్టార‌ర్ కు రంగం సిద్ధం చేసాడు. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్, వెంక‌టేశ్ హీరోలుగా న‌టిస్తున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కావ‌డా నికి ఇంకా చాలా టైమ్ ప‌డుతుంది. వెంకీ ప్ర‌స్తుతం తేజ సినిమాతో.. వ‌రుణ్ ప్ర‌స్తుతం సంక‌ల్ప్ రెడ్డి సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత కానీ అనిల్ సినిమా కోసం ఈ ఇద్ద‌రు హీరోలు రారు. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడ‌ట‌మే. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా మెహ్రీన్, త‌మ‌న్నా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ్రీన్.. వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను మార్చి అనిల్ ఎలాంటి మ్యాజిక్ చేయ‌బోతున్నాడో..? 

More Related Stories