English   

హైబ్రిడ్ పిల్ల బ‌ర్త్ డే నేడు..!

Sai-Pallavi
2018-05-09 11:41:17

హైబ్రిడ్ పిల్ల అంటే మ‌రో ఆలోచ‌న లేకుండా బుర్ర‌లో మెదిలే పేరు సాయిప‌ల్ల‌వి. ఫిదాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ‌. దాని కంటే ముందే ప్రేమ‌మ్ తో క‌ట్టిప‌డేసింది. మే 9 న ఆమె పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోన్న ప‌డిప‌డి లేచే మ‌న‌సులో ఆమె ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. శ‌ర్వానంద్ ఇందులో హీరో. హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే క‌ల‌క‌త్తాలో ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు శ‌ర్వానంద్. దానికితోడు రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఒక‌టి 40 ప్ల‌స్ రోల్ అని వార్త‌లొస్తున్నాయి. ఈ పాత్ర కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు శ‌ర్వానంద్. ఇందులో ఆ మ‌ధ్య శ‌ర్వా పుట్టిన‌రోజు నాడు అత‌డి ఫ‌స్ట్ లుక్ వ‌చ్చింది. 

ఇప్పుడు సాయిప‌ల్ల‌వి ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లైంది. లై లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత హ‌ను తెర‌కెక్కిస్తోన్న సినిమా ఇది. క‌చ్చితంగా దీనిపై అంచ‌నాల‌తో పాటు ఆస‌క్తి కూడా బాగానే ఉంది. దానికి కార‌ణం శ‌ర్వానంద్, సాయిప‌ల్లవి జోడీ.. పైగా ఇద్ద‌రూ మంచి జోరు మీదుండ‌టం. ఎంసిఏలో సాయిప‌ల్ల‌వి పాత్ర‌ను క‌ట్ చేసార‌ని వ‌స్తున్న నేప‌థ్యంలో శ‌ర్వా సినిమాలో మాత్రం పూర్తిగా ప‌ల్ల‌వి పాత్రే సినిమాకు హైలైట్ అవుతుంద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా హ‌ను త‌న సినిమాల్లో హీరోయిన్ల‌కు మంచి పాత్ర‌లే ఇచ్చాడు. లై మిన‌హాయిస్తే అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథల్లో హీరోయిన్ల పాత్ర‌ల‌కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మొత్తానికి చూడాలిక‌.. ప‌డిప‌డి లేచే మ‌న‌సు ఎలా ఉండ‌బోతుందో.. నిజంగానే ఈ సినిమా ప‌డి ప‌డి లేస్తుందో లేదంటే ఒకేసారి పైకి బాగా లేస్తుందో చూడాలిక‌..!

More Related Stories