English   

సాయిప‌ల్ల‌వి ఇలాంటి షాక్ ఇచ్చిందేంటి..?

Sai-Pallavi
2018-03-06 09:24:42

సింపుల్ గా ఉంటాం అని మాట‌ల్లో చెప్ప‌డం కాదు.. చేత‌ల్లో కూడా చూపించాలి. అది చూపించేవాళ్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. అందులో తాను ఉన్నానంటుంది సాయిపల్ల‌వి. ఈ ముద్దుగుమ్మ చాలా అంటే చాలా సింపుల్. అమ్మాయిగారి తీరుపై ఇండ‌స్ట్రీలో కొన్ని వార్త‌లు వినిపిస్తాయి కానీ మీడియా ముందు ప‌ల్లవి ప్ర‌వ‌ర్త‌న మాత్రం సీత మంచి బాలిక టైప్ లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా క‌ణం సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో సాయిప‌ల్ల‌వి తీరు చూసి అంతా షాక్ అయిపోయారు. ఈ వేడుక‌కు కార్ లో కాకుండా బైక్ పై వ‌చ్చి షాక్ ఇచ్చింది ప‌ల్ల‌వి. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈ వేడుక‌కు కార్ లో వ‌స్తున్న‌పుడు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయింది ప‌ల్ల‌వి. దాంతో త‌న అసిస్టెంట్ బైక్ ఎక్కి ఈవెంట్ కు వ‌చ్చింది సాయిప‌ల్లవి. ఈమెను బైక్ పై చూసి అక్క‌డున్న అభిమానుల‌తో పాటు నిర్మాత‌లు కూడా షాక్ అయ్యారు. స‌మ‌యానికి రావ‌డం కోసం కార్ కాద‌ని బైక్ పై వ‌చ్చి త‌న సింప్లిసిటీని చూపించింది సాయిప‌ల్ల‌వి. మ‌రి ఇలాంటి ముద్దుగుమ్మ‌పై టైమ్ కు సెట్ కు రాద‌ని రూమ‌ర్లు ఎందుకు వ‌స్తున్నాయో మ‌రి..?         

More Related Stories