English   

అడ‌ల్ట్ సినిమాలో సాయి ప‌ల్ల‌వి

Sai-Pallavi
2018-03-21 07:24:43

అవును సాయి ప‌ల్ల‌వి ఓ అడ‌ల్ట్ సినిమాలో న‌టించేందుకు ఒప్పుకుంది. మామూలురొమాన్స్ కే అన్నీ క‌ప్పుకునే ఈ హైబ్రిడ్ పోరీ అడ‌ల్ట్ సినిమా ఒప్పుకోవ‌డం ఏంటీ అనిపిస్తోంది కదూ. నిజ‌మే.. కానీ త‌ను కొత్త‌గా ఓ సినిమా యాక్సెప్ట్ చేసింది. ఆ ద‌ర్శ‌కుడుకి మాత్రం అడ‌ల్ట్ రేటింగ్ సినిమాలంటే మ‌హా ఇష్టం. అత‌ను తీసే దాదాపు అన్ని సినిమాల‌కూ ఏ స‌ర్టిఫికెటే వ‌స్తుంది. అయినా సాయి ప‌ల్ల‌వి ఆ సినిమాలో న‌టించేందుకు ఒప్పుకుంది. అన్న‌ట్టు ఇది హార‌ర్ థ్రిల్ల‌ర్ కూడా న‌ట‌. కాక‌పోతే కాస్త రొమాన్స్ గ‌ట్టిగా ద‌ట్టిస్తార‌ని టాక్. ఇక సాయి ప‌ల్ల‌వి ఇందులో న‌టించ‌డం వింతైతే.. ఇంత‌కంటే మ‌రీ ఆశ్చ‌ర్య‌పోయే మేట‌ర్ మ‌రోటుంది. ఈ మూవీలో భానుమ‌తితో పాటు పొట్టి పిల్ల నిత్య‌మీన‌న్ కూడా న‌టిస్తోంది. మ‌రి ఇలాంటి భామ‌ల‌ను రొమాంటిక్ హార‌ర్ థ్రిల్ల‌ర్ లో సెలెక్ట్ చేసుకున్న ఆ ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా... మిస్కిన్. ఇలాంటి రొమాంటిక్ మూవీస్ తీయ‌డంలో మిస్కిన్ ఎక్స్ ప‌ర్ట్. 

అయితే ఈ సినిమాకు ఈ ప్ర‌త్యేక‌త‌లు మాత్ర‌మే కాదు.. మ‌రో హైలెట్ కూడా ఉంది. ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నాడు. నిన్న‌టి త‌రం స్టార్ డైరెక్ట‌ర్ క‌మ్ యాక్ట‌ర్ అయిన భాగ్య‌రాజా త‌న‌యుడు శంత‌న్ భాగ్య‌రాజా హీరోగా న‌టిస్తోన్న మూవీ ఇది. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి తెలుగు, త‌మిళంలో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఒక ర‌కంగా త‌మిళ్ లో ఎక్కువ బిజీగా ఉంది. అటు నిత్య‌మీన‌న్ రీసెంట్ గా అ అనే సినిమాలో న‌టించింది. అంత‌కు ముందు కానీ ఇప్పుడు కానీ అమ్మ‌డు పెద్ద‌గా బిజీగా లేదు. కానీ ఇలాంటి క‌థ‌కు ఓకే చెప్పిందంటే ఖ‌చ్చితంగా ఈ క‌థ‌లో ఏదో మేట‌ర్ ఉండే ఉంటుంద‌నుకోవ‌చ్చు. ఏదేమైనా ఇటు హైబ్రిడ్ బ్యూటీ అటు పొట్టి పిల్ల‌.. త‌ర్వాత ఇళ‌య‌రాజా, మిస్కిన్ అండ్ శంత‌న్..  కాంబినేష‌న్ గ‌ట్టిగానే ఉంద‌నుకోవ‌చ్చు.

More Related Stories