English   

 సాయిప‌ల్ల‌వికి ఫ‌స్ట్ షాక్..

saipallavi-kanam

గొడ‌వ‌ల్లేని సంసారం.. ఫ్లాపుల్లేని ఇండ‌స్ట్రీ ప్ర‌యాణం అసాధ్యం. ఎంత దూకుడు చూపించినా ఎక్క‌డో ఓ చోట బ్రేకులు ప‌డాల్సిందే. కాక‌పోతే కొంద‌రికి ఆల‌స్యం అవుతుందంతే. ఇప్పుడు సాయిప‌ల్ల‌వి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ భామ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి మూడేళ్లు దాటిపోయింది. నాలుగు సినిమాలు చేసింది.. అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లే. ఇప్పుడు తొలి ఫ్లాప్ ప‌డింది. అదే క‌ణం.. ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి టాక్ బాగానే వ‌చ్చినా.. క‌మ‌ర్షియ‌ల్ గా నిల‌బ‌డ‌లేదు. క‌ర్ణుడి చావుకు ల‌క్ష కార‌ణాల‌న్న‌ట్లు క‌ణం ఫ్లాప్ కు ఎన్నో కార‌ణాలు. ఈ చిత్రం ఆర్నెళ్లు బాక్సుల్లోనే ఉంది. దాంతో ఈ చిత్రంపై ముందు ఉన్న అంచ‌నాలు విడుద‌ల టైమ్ కు లేవు. దానికితోడు అవేంజ‌ర్స్.. భ‌ర‌త్ అనే నేను.. రంగ‌స్థ‌లం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో వ‌చ్చిన సినిమా ప్రేక్ష‌కుల‌కు స‌రిగ్గా రీచ్ కాలేక‌పోయింది. ప్ర‌మోష‌న్ కూడా పెద్ద‌గా చేసుకోలేదు. దాంతో క‌ణం ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయింది. ఏదేమైనా తొలి ఫ్లాప్ అయితే అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం హ‌ను రాఘ‌వ‌పూడి-శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచే మ‌న‌సుతో పాటు సూర్య-సెల్వ ఎన్ జి కే.. ధ‌నుష్ మారి 2 సినిమాల్లో న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. 

More Related Stories