English   

క‌ణం.. అక్క‌డ హిట్టేనండోయ్..!

Sai-Pallavi

సాయిప‌ల్ల‌వి సినిమాలో ఉందంటే అది ఫ్లాప్ అయ్యే స‌మ‌స్యే లేదు. అయితే తెలుగులో ఈమెకు తొలి దెబ్బ త‌గిలేలా ఉంది. క‌ణం సినిమాకు ఇక్క‌డ ఊహించిన రెస్పాన్స్ అయితే రావ‌డం లేదు. సినిమా బాగుంది.. టాక్ బాగుంది.. మంచి సినిమా అని పొగుడుతున్నారు కానీ క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం ఈ చిత్రం ఇక్క‌డ స‌ర్వై అవ్వ‌డం క‌ష్ట‌మే. కానీ త‌మిళ‌నాట మాత్రం దియాకు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అక్క‌డ దియాగా విడుద‌లైంది క‌ణం. సాయిప‌ల్ల‌వికి ఉన్న క్రేజ్.. ద‌ర్శ‌కుడు విజ‌య్ కు ఉన్న గుర్తింపుతో క‌ణం అక్క‌డ బాగానే ఆడుతుంది. పైగా సెలెబ్రెటీస్ కూడా చూసి ఈ చిత్రాన్ని బాగుంద‌ని ప్ర‌మోట్ చేస్తున్నారు. దాంతో క‌ణం సినిమాకు త‌మిళ‌నాట ఓపెనింగ్స్ బాగానే వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో సినిమాలే లేక చూస్తోన్న అర‌వోళ్ల‌కు క‌ణం బంప‌ర్ ఆఫ‌ర్ కింద దొరికింది. దాంతో ఈ చిత్రానికే ప‌ట్టం క‌డుతున్నారు వాళ్లు. మొత్తానికి సొంత భాష‌లో కూడా తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది సాయిప‌ల్ల‌వి. 

More Related Stories