English   

సాయి పల్లవి వెర్షన్ వేరేలా ఉందే..?

Sai-Pallavi

సాయి పల్లవికి హెడ్ వెయిట్.. ఎవర్నీ లెక్క చేయదు.. కో ఆర్టిస్ట్ అంటే గౌరవం లేదు.. ఇవీ కొన్నాళ్ల క్రితం సాయి పల్లవిపై నాగ శౌర్య చేసిన కమెంట్స్. ఈ ఇద్దరు కలిసి కణం అనే సినిమాలో నటించారు. ఈ షూటింగ్ టైమ్ లోనే శౌర్యకు, సాయి పల్లవికి చెడింది.. ఈ మాట సాయి పల్లవి అనలేదు కానీ  నాగ శౌర్య అన్నాడు. సరిగ్గా అదే టైమ్ లో ఎమ్ సిఏ చేస్తోన్న సాయి పల్లవికి నానితోనూ విభేదాలున్నాయనే వార్తలు వచ్చాయి. దీంతో ఆమె అలా చేసి ఉండొచ్చు. సాయి పల్లవికి తలపొగరు అనుకున్నారు చాలామంది. ఈ లోగా ఇటు నాగశౌర్య ఛలోతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి శౌర్య కణం సినిమాను పూర్తిగా వదిలేశాడు. ఇదే విషయం సాయి పల్లవిని అడిగితే అతనితో తనకెలాంటి విభేదాలు లేవని అప్పట్లోనే క్లియర్ గా చెప్పేసింది. ఒకవేళ శౌర్య నా వల్ల ఇబ్బందిపడితే సారీ అని కూడా చెప్పింది. అయినా అతను పట్టించుకోలేదు. 

ఇక లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ నెల 27న కణం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కు వచ్చిన సాయి పల్లవిని మరోసారి నాగశౌర్య గురించి అడిగితే ఇలా చెప్పింది.. నాగశౌర్యతో నాకైతే ఖచ్చితంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. అతను మంచి ఆర్టిస్ట్. కానీ సీన్ ఇంకా బాగా రావాలని నేను దర్శకుడిని పదేపదే సీన్ గురించి అడుగుతుంటాను. అది అతనికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. కానీ నాకు నా పని ఇంపార్టెంట్. ఇతర విషయాలు పట్టించుకోను. ఈ విషయంలో శౌర్యతో మాట్లాడాలని నేను చాలాసార్లు ఫోన్ చేశాను. కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు’’ అని మరోసారి కుండబద్ధలు కొట్టింది సాయి పల్లవి. 

మరి సాయి పల్లవి ఇంత క్లియర్ గా చెప్పినా శౌర్య ఎందుకు పట్టించుకోవడం లేదు.. అంటే అతను ఛలో హిట్ తర్వాత చాలా మారిపోయాడని ఎంటైర్ ఇండస్ట్రీ అంటోంది. నిజానికి సాయిపల్లవికి కాదు.. ఛలో హిట్ శౌర్య తలకెక్కిందనే వారూ ఉన్నారు. మరోవైపు కణం లేడీ ఓరియంటెడ్ గా సాగే కథ. అందువల్లే ఇతను పట్టించుకోవడం లేదనీ అంటున్నారు. అలాగైతే కథ తెలియకుండా నటించరు కదా. అది ముందే తెలియదా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఛలో హిట్ తర్వాత మళ్లీ తను అలాంటి సినిమాను ఎంకరేజ్ చేస్తే ఇబ్బంది అని ఫీలవుతున్నాడట. ఏదేమైనా నాగశౌర్య చేస్తున్నది తప్పు. తనూ నిర్మాతగా మారాడు.ఓ సినిమా కోసం నిర్మాత ఎంత తపన పడతాడో కూడా తెలిసే ఉంటుంది. మరి ఆ సినిమాకు హీరోయిన్ కంటే హీరో చేసే ప్రమోషన్ ఎంత ప్లస్ అవుతుందో కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇన్ని తెలిసి కూడా అతను కణంను పట్టించుకోవడం లేదంటే.. ఖచ్చితంగా అతను మారే ఉంటాడు.. 

More Related Stories