English   

సూర్య‌ను కూడా వ‌ద‌ల‌వా సాయిప‌ల్ల‌వి..?

SaiPallavi
2018-02-23 10:48:47

ఇండ‌స్ట్రీలో అంతే.. ఇమేజ్ మంచిదైనా చెడ్డ‌దైనా ఒక్క‌సారి వ‌చ్చిందంటే పోదు. సాయిప‌ల్ల‌వి విష‌యంలో రెండూ ఒకేసారి జ‌రుగుతున్నాయి. ఈ భామ‌కు ఒక్క సినిమాతోనే సూప‌ర్ స్టార్ డ‌మ్ వ‌చ్చేసింది. ఈమె ఉంటే చాలు సినిమా ఆడుతుందిలే అనేంత ఇమేజ్ వ‌చ్చేసింది. హీరోల‌కు కూడా లేని క్రేజ్ సాయిప‌ల్ల‌వి సొంతం అయిపోయింది. అయితే సాయిప‌ల్ల‌వికి టాలెంట్ తో పాటు ఆటిట్యూడ్ కూడా ఎక్కువే ఉంద‌నే వార్త‌లు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విష‌యంపై నాగ‌శౌర్య నేరుగానే సాయిప‌ల్ల‌విని విమ‌ర్శించాడు. త‌న‌ను చాలా ఇరిటేట్ చేసిన హీరోయిన్ కూడా ఈమె అని పేరు పెట్టి మ‌రీ చెప్పాడు శౌర్య‌. ఫిదాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. ఎంసిఏతో స్టార్ హీరోయిన్ గా మారిన సాయిప‌ల్ల‌విపై ఇప్పుడు ఇలాంటి రూమ‌ర్లు రావ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌రంగానే అనిపిస్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు సాయిప‌ల్ల‌వి అంటే కేరాఫ్ క్లీన్ ఇమేజ్.. అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటూ.. కేవ‌లం న‌ట‌న‌తోనే నెట్టుకొస్తుంది ఈ త‌మిళ పొన్ను. దానికి తోడు స్టార్ హీరోల సినిమాల‌ను కాద‌ని.. కేవ‌లం త‌న‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌ల్లోనే న‌టిస్తూ ఔరా అనిపిస్తుంది. ప‌క్కింటి అమ్మాయిలా ఉంటే ఈ హీరోయిన్ పై సెట్ కు టైమ్ కు రాద‌ని.. షూటింగ్ ల‌కు ఆల‌స్యంగా వ‌స్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎంసిఏ సెట్ లోనే నాని, సాయిప‌ల్ల‌వికి ఈ విష‌యంలోనే గొడవ జ‌రిగింద‌నే వార్తలు అప్ప‌ట్లో వినిపించాయి. దిల్ రాజే ఈ ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చాడ‌నే టాక్ కూడా వ‌చ్చింది. ఇప్ప‌టికీ సాయిప‌ల్ల‌వి తీరు మార‌లేదంటున్నారు కొంద‌రు. ఉద‌యం 9 గం.కు రావాల్సిన సెట్ కు 11-12 గంట‌ల‌కు వ‌స్తుందని.. దానివ‌ల్ల నిర్మాత‌ల‌తో పాటు చిత్ర‌యూనిట్ చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌నే కంప్లైంట్స్ సాయిప‌ల్ల‌విపై వ‌చ్చాయి.

అచ్చంగా ఇవే విమ‌ర్శ‌లు నాగ‌శౌర్య కూడా చేసాడు. ఈ మ‌ధ్యే ప‌ల్ల‌వితో క‌లిసి న‌టించిన ఈ హీరో ఈ క‌మెంట్స్ చేసాడు. త‌మ‌కు సాయిప‌ల్ల‌వి చుక్క‌లు చూపించింద‌ని.. ఆటిట్యూడ్ తో చంపేసింద‌ని చెప్పాడు ఆ హీరో. ఒక్క‌రోజు కూడా టైమ్ కు రాలేద‌ని.. ఆమె వ‌ల్ల షూటింగ్ డిస్ట‌ర్బ్ అయింద‌ని చెప్పాడు ఈ హీరో. ఇక ఇప్పుడు సూర్యతో న‌టిస్తోన్న సినిమాకు కూడా అప్పుడే సాయిప‌ల్ల‌వి ఆటిట్యూడ్ మొద‌లైపోయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌నకు ఇష్ట‌మైన హీరోకు కూడా సాయిప‌ల్ల‌వి రిబేట్ ఇవ్వ‌డం లేదు. అక్క‌డ కూడా షూటింగ్స్ కు ఆల‌స్యంగానే వ‌స్తుంద‌నే టాక్ వ‌స్తుంది. త‌మిళ‌నాట ప్ర‌స్తుతం సూర్య‌తో పాటు ధ‌నుష్ మారి 2లోనూ న‌టిస్తుంది సాయిప‌ల్ల‌వి. ఈ రూమ‌ర్లు అన్ని అబ‌ద్ధ‌మైతే ఓకే.. కానీ నిజ‌మే అయితే మాత్రం క‌చ్చితంగా ఈ భామ కెరీర్ పై అది ప్ర‌భావం చూపించ‌కుండా ఉండ‌దు.

More Related Stories