English   

నేను ఆ టైప్ కాదంటున్న సాయిప‌ల్ల‌వి.. 

Sai-Pallavi
2018-03-12 18:08:18

సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఒప్పుకుంటే సినిమా హిట్ అంతే. మ‌రో మాట లేదు. పెద్ద‌గా అంద‌గ‌త్తె కాక‌పోయినా ఎక్స్ ప్రెష‌న్స్ తోనే అంద‌ర్నీ ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. సినిమాల్లో ఇంత క్రేజ్ ఉన్న‌పుడు యాడ్స్ లో కూడా సాయిప‌ల్ల‌వికి ఆఫ‌ర్లు రావ‌డం స‌హ‌జం. ఇప్పుడు యాడ్ కాదు కానీ అమెరికా నుంచి ఈ భామ‌కు ఓ దిమ్మ‌తిరిగే ఆఫ‌ర్ వ‌చ్చింది. కేవ‌లం రెండు గంట‌లు మాత్ర‌మే వ‌చ్చి త‌మ ఈవెంట్ ను ప్ర‌మోట్ చేయాల్సిందిగా కొంద‌రు ఈ ముద్దుగుమ్మను కోరారు. దానికోసం ఏకంగా 40 ల‌క్ష‌ల‌కు పైగా ఇవ్వ‌డానికి రెడీ అయ్యారు. పైగా అమెరికాకు బిజినెస్ క్లాస్ టికెట్ల‌తో పాటు ల‌గ్జ‌రీ హోట‌ల్ రూమ్స్ కూడా ఇస్తామ‌ని చెప్పారు. ఇన్ని చెప్పినా కూడా సాయిప‌ల్ల‌వి మాత్రం చాలా సింపుల్ గా తన‌కు ఇలాంటివి ఇష్టం ఉండ‌వ‌ని.. డ‌బ్బు కోసం తాను ఇలాంటివి చేయ‌న‌ని చెప్పింద‌ని తెలుస్తుంది. అవ‌స‌రం అనుకుంటే ఫ్రీగా సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి రెడీ కానీ ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ ప్రోగ్రామ్స్ మాత్రం చేయ‌న‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. దాంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఆ ఈవెంట్ మేనేజ‌ర్ల వంత‌యింద‌ని తెలుస్తుంది. ఈ రోజుల్లో ముద్దుగుమ్మ‌లు డ‌బ్బు ఎలా సంపాదించాలో మార్గం వెతుక్కుం టుంటే.. సాయిప‌ల్ల‌వి మాత్రం ఉన్న మార్గాల్ని కూడా మూసేస్తుంది. మొత్తానికి ఈ భామ నిర్ణ‌యానికి కొంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నా.. మ‌రికొంద‌రు మాత్రం ఈమె ఆశ‌యాల‌కు ప్ర‌శంసిస్తున్నారు. 

More Related Stories