English   

సాయిపల్లవి ఎవరికీ అర్థం కాదా.. ?

Sai-Pallavi
2018-08-06 10:40:03

సాయి పల్లవి.. ప్రేమమ్ తో తెలుగు ఆడియన్స్ తను తన ప్రేమలో వేసుకుంది. ఫిదాతో ఏకంగా ఇక్కడే పాగా వేసేసి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోన్న బ్యూటీ. అయితే అమ్మడిలో చాలా మేటర్స్ ఉన్నాయని ఈ మధ్య తరచూ చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన తోటి హీరోలతో గొడవలు పడటం విషయంలో అదే పనిగా వస్తున్నాయీ గాసిప్స్.. తర్వాత వాటిని తానెలాగూ ఖండిస్తుంది. పన్లో పనిగా ఆ సినిమా మేకర్స్ కూడ అబ్బే .. అట్టాంటిదేం లేదే.. అంటారనుకోండి. గతంలో కణం సినిమా టైమ్ లో నాగశౌర్యతో దురుసుగా ప్రవర్తించిందని ఆ ‘‘స్టార్’’ హీరో తెగ అలిగిపోయాడు. కానీ తర్వాత అమ్మడు ఇచ్చిన క్లారిఫికేషన్ కూడా అందరినీ ఫిదా చేసింది. ఇక ఎమ్.సి.ఏ టైమ్ లో నానితోనూ గొడవలు పడిందన్నారు. యథావిధిగా నిర్మాతలు కాదన్నారు. ఇప్పుడు శర్వానంద్ తో చేస్తోన్న పడిపడి లేచెమనసు సినిమా విషయంలోనూ ఇవే వినిపిస్తున్నాయి. బట్ వీటినీ ఖండించారనుకోండి.

అయితే అసలు తనకు ఇలా ప్రతిసారీ హీరోలతో గొడవల విషయంలో ఎందుకు రూమర్స్ వస్తున్నాయి. రుజువులు లేకుండా రూమర్స్ రావొచ్చేమో కానీ.. నిప్పు లేకుండా పొగరాదు కదా.. అది నిజమే అయితే సాయి పల్లవి ఏదో చేస్తుందనే కదా అనేవారూ లేకపోలేదు. బట్ రూమర్స్ అన్నీ బేస్ లెస్ అనే వారి రెగ్యులర్ డైలాగ్.. ఇక ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే.. తను పనిచేస్తోన్న హీరోల విషయంలోనే తనపై ఎందుకు రూమర్స్ వస్తున్నాయనేది ఎవరికీ అర్థం కావడం లేదు.. అయితే లేటెస్ట్ గా అమ్మడు మరో హీరో విషయంలో ఓ సెన్షేషనల్ డెసిషన్ తీసుకుంది. సెన్షేషనల్ అని ఎందకన్నామంటే.. ఈ విషయంలో సమంత, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే కూడా నో చెప్పలేదు. కానీ తను చెప్పింది.

యస్.. ఈ మధ్య స్టార్ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తూ తొలి సినిమా నుంచి హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాతి సినిమా కోసం సాయిపల్లవిని అడిగారట. బట్ తను నో చెప్పింది. దీంతో కాస్త షాక్ అయినా ఆ టీమ్.. ఏకంగా రెండు కోట్లు ఇస్తామని భారీ ఆఫర్ ఇచ్చింది. అయినా సరే నో చెప్పిందట. మరి సమంత లాంటి హీరోయిన్నే నో చెప్పలేదు.. కానీ సాయిపల్లవి చెప్పేసరికి ఆ కుర్రాడు కాస్త ఇదైపోయాడని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా సాయి పల్లవి ఎవరికీ అర్థం కాదు అనే మాట నిజమే అంటున్నారు. 

More Related Stories