English   

రౌడీ బేబీకి శేఖర్ కమ్ముల బంపరాఫర్

Sai Pallavi
2021-06-21 15:33:53

శేఖర్ కమ్ముల కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ ప్రేమ కథలు లను హృదయాలను హత్తుకునే విధంగా తీయడంలో ఎక్స్పర్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .హ్యాపీ డేస్ సినిమా తర్వాత కొన్ని అపజయాలు వచ్చినా కూడా మళ్లీ 'ఫిదా' సినిమాతో కమ్ముల ట్రాక్ లోకి వచ్చాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ అనే సినిమాకు దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవి కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే ధనుష్ తో ఒక సినిమా చేస్తానని శేఖర్ కమ్ముల ఇదివరకే ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి ని తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. 

దీనికి గల కారణం సాయి పల్లవి ధనుష్ తో కలిసి మారి 2 చిత్రంలో నటించడం..దాంతో వారి మధ్య ఇప్పటికే మంచి కెమిస్ట్రీ ఉండటమేనట. అంతే కాకుండా మారీ 2లో ఈ జంట కు మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు సాయి పల్లవికి కూడా తెలుగు, తమిళ, మలయాళం, భాషల్లో క్రేజ్ ఉండడంతో భాగా వర్క్ అవుట్ అవుతుందని శేఖర్ కమ్ముల భావిస్తున్నారు. ఈ సినిమాతో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా రేంజ్లో తన సత్తా చాటాలి అనుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి నటించే మూడవ సినిమా అవుతుంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

More Related Stories