English   

క‌న్నుగొట్టిన పిల్ల‌కు సాయిప‌ల్ల‌వి వార్నింగ్.

sai pallavi
2018-03-06 17:12:55

సాయిప‌ల్ల‌వి అంటే చాలా సాఫ్ట్ అనే ఇమేజ్ ఉంది ఇండ‌స్ట్రీలో. ఈమె ఎవ‌ర్నీ ఒక్క మాట కూడా అన‌దు అంటారు. కానీ ఇప్పుడు ఈ భామ ఓ హీరోయిన్ కు వార్నింగ్ ఇచ్చింది. అది కూడా తెలియ‌కుండానే సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఈమె వార్నింగ్ ఇచ్చింది ఎవ‌రికో కాదు.. ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ కే. ఒక్క రోజులోనే నెట్టింటిని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌కు ఇప్పుడు సాయిప‌ల్ల‌వి చిన్న‌సైజ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రియాకు ఇప్పుడు వ‌చ్చిన ఇమేజే ఒక‌ప్పుడు త‌న‌కు కూడా వ‌చ్చింద‌ని గుర్తు చేసుకుంది సాయిప‌ల్ల‌వి. ప్రేమ‌మ్ సినిమాతో సౌత్ ఇండియా మొత్తం పాపుల‌ర్ అయింది సాయిప‌ల్ల‌వి. ఆ త‌ర్వాత ఆమె అడిగినంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చి సినిమాల్లోకి తీసుకున్నారు. తెలుగులో ఫిదా, ఎంసిఏతో స్టార్ అయిపోయింది ఈ భామ‌. ఇప్పుడు ప్రియాకు కూడా ఒక్క సినిమా కూడా విడుద‌ల కాకుండానే అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారంతా. 
ఒక్క సినిమా కూడా విడుద‌ల కాక ముందే ప్రియాకు వ‌స్తున్న ఛాన్సులు చూసి.. జాగ్ర‌త్త అంటూ సాఫ్ట్ గా వార్నింగ్ ఇస్తుంది సాయిప‌ల్ల‌వి. స్టార్ డమ్ సంపాదించుకోవడం కంటే దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టమని చెప్పింది. ఒక్క‌సారి వ‌చ్చిన ఇమేజ్ ను చాలా జాగ్ర‌త్త‌గా వాడ‌క‌పోతే కెరీర్ నాశ‌నం అయిపోతుంద‌ని చెబుతుంది ఈ భామ‌. ప్రియాకు కూడా ఇదే చెబుతున్నానంటుంది సాయిప‌ల్ల‌వి. ఇక మీదట మరింత శ్రద్ధతో ఆలోచించి సినిమాలకి సైన్ చేయాలనీ.. పారితోషికం గురించి కాకుండా క‌థ బాగుంటేనే సినిమా ఒప్పుకోవాల‌ని.. అప్పుడు ఆటోమేటిక్ గా స్టార్ ఇమేజ్ వ‌స్తుంద‌ని ప్రియాకు సల‌హాలు ఇచ్చింది సాయిప‌ల్ల‌వి. నిజ‌మే క‌దా.. ఆమె అలా చేసినందుకే ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈమె కోసం స్టార్స్ కూడా క్యూ లో ఉన్నారు.

More Related Stories