English   

అన్నిటికీ ‘సాక్ష్యం’ ఉంది

Saakshyam-Teaser

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా సాక్ష్యం టీజర్ విడుదలైంది. శ్రీవాస్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీ టీజర్ ఊహించినట్టుగానే అదిరిపోయింది. పంచభూతాల సాక్షిగా ప్రతి మనిషినీ కర్మ సిద్ధాంతం వెంటాడుతుందని చెప్పడమే టీజర్ తో సినిమాలోనూ కనిపించే అంశంగా తెలుస్తోంది. ప్రతి మనిషి తప్పు చేస్తూ నాలుగు దిక్కులూ చూస్తాడు. అప్పుడు తననెవరూ చూడట్లేదనుకుంటాడు. కానీ ఐదో దిక్కు ఉంటుంది. అదే ఆకాశం. అక్కడి నుంచి అంతా చూస్తూనే ఉంటాడు. ఆ సాక్ష్యంను చెరపడం ఎవరివల్లా కాదు అనే డైలాగ్ అదిరిపోయింది. అలాగే కాశీలో కాలుతున్న శవాన్ని చూపించి ఓ అఘోరా శ్రీనివాస్ తో చెప్పే ‘కాలిపోవడానికి, బూడిద కావడానికి అది శవం కాదు సాక్ష్యం’ అనే చెప్పే మాట ఇంట్రెస్టింగ్ గా ఉంది. 1.38 నిమిషాలున్నా ఈ టీజర్ లో దాదాపు సినిమాలోని అన్ని పాత్రలూ పరిచయం చేశారు. పూజా హెగ్డేను కాస్త సంప్రదాయంగా చూపించారు. విలన్ గా జగపతిబాబు మరోసారి దుమ్మురేపేలా ఉన్నాడీ టీజర్ లో. మొత్తంగా పంచభూతాల నేపథ్యంలో రాబోతోన్న ఈ సాక్ష్యం టీజర్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఫైనల్ గా టైటిల్ కు ముందు ఆకాశాన్ని కన్నుగా మలచి చేసిన గ్రాఫిక్ అద్భుతహః. అంతే.

More Related Stories