English   

సాయి ధ‌ర‌మ్ తేజ్ రిప‌బ్లిక్ మూవీ టీజ‌ర్ టాక్

Republic
2021-04-06 12:07:52

సాయి ధ‌ర‌మ్ తేజ్ రిప‌బ్లిక్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమాకు దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిత్రంలో ర‌మ్య‌క్రిష్ణ మ‌రియు జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు హీరోయిన్  గా ఐశ్య‌ర్య రాజేశ్ న‌టిస్తోంది. తాజాగా విడుదల చేసిన 'రిపబ్లిక్' టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

''ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో.. అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ, కట్టకుండానే కూలిపోతోన్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులన్న విషయం తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం. ప్రజలే కాదు సివిల్ సర్వెంట్లు, కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసలుగా బతుకుతున్నారు. వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరూ కరెప్టే సార్'' అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనేది చెప్పకనే చెబుతున్నాయి.

More Related Stories