English   

రిపబ్లిక్ ను పూర్తి చేసిన సాయిధరమ్ తేజ్

Sai Tej
2021-02-23 12:38:53

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా "రిపబ్లిక్". ఈ సినిమా కు దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా....శివగామి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ సినిమాను స్వరాలు సమకూరుస్తున్నారు. అంతే కాకుండా జెబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ను తాజాగా పూర్తి చేసుకుంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసి జూన్ 4న సినిమా ను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుంది. ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన చివరి సినిమా "సోలో బ్రతుకే సో బెటర్" సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో రిపబ్లిక్ పైనే ఈ యంగ్ హీరో ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

More Related Stories