English   

వివాదంలో చిక్కుకున్న సైఫ్ అలీఖాన్

Saif Ali Khan Tandav
2021-01-18 11:26:06

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన నటించిన "తాండవ్" అనే వెబ్ సిరీస్ పై వివాదం నెలకొంది. తాండవ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ లో హిందూ దేవుళ్లను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని..దీన్ని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ దేవుళ్లపై కొన్ని సీన్లు నీచంగా ఉన్నాయంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దీనిపై నెటీజన్లతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాండవ్ వెబ్ సిరీస్ అసలు బాగోలేదని..పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చిందని దాంతో హైప్ క్రియేట్ చేయడానికే ఇలా వివాదాలు సృష్టిస్తున్నారని వాదన కూడా వినిపిస్తోంది. వెబ్ సిరీస్ పై లేనిపోని వివాదాలు సృష్టించి క్రేజ్ పెంచేందుకే మేకర్స్ హిందూ దేవుళ్లను వాడుకుంటున్నారని కొందరు వాదిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ముఖ్యంగా శివుడి, విష్ణువు భక్తుల్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వెబ్ సిరీస్ మేకర్స్ ఈ వివాదాలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

More Related Stories