English   

వైల్డ్‌డాగ్‌ లో నా యాక్షన్‌తో ఆశ్చర్యపరుస్తా.. సయామి ఖేర్

Saiyami Kher
2021-03-27 17:50:49

కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్‌ డాగ్’. ఈ ఏప్రిల్‌ 2 ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. 

ఈ సినిమాలో నేను ‘రా’(రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌ ఆర్యా పండిట్‌ పాత్రలో నటించాను. దర్శకుడు సాల్మన్‌ ద్వారా వైల్డ్‌డాగ్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నాగ్‌సార్‌ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ) ఏజెంట్‌ విజయ్‌ వర్మ పాత్రలో కనిపిస్తారు. ‘రా’ ఏంజెట్‌ అయిన నేను నాగ్‌సార్‌ లీడ్‌ చేస్తున్న ఎన్‌ఐఏ టీమ్‌తో ఎందుకు కలిసి పనిచేయాల్సి వచ్చింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నా పాత్ర గురించి చెప్పగానే ఎగై్జట్‌ అయ్యాను. సాధారణంగా హీరోయిన్‌ పాత్రలకు పెద్దగా యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉండవు. కానీ ఈ సినిమా నాకు చాలా యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటాయి. నాగ్‌సార్‌తో కూడా ఓ చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంది. నాకు స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యత ఉంది. స్పోర్ట్స్‌ అంటే చాలా ఫిట్‌నెస్‌తో ఉండాలి. ఆ ఫిట్‌నెస్‌ నాకు ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేసేందుకు ఉపయోగపడింది. అంతేకాదు ఈ సినిమా కోసం నేను ముంబైలో మార్షల్స్‌ ఆర్ట్స్‌లో నెలరోజులు ప్రత్యేకశిక్షణ తీసుకున్నాను. వైల్డ్‌డాగ్‌ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి. 

 ప్రస్తుతం అమెజాన్‌లో ఓ వెబ్‌ షో, హాట్‌స్టార్‌లో ఓ వెబ్‌సిరీస్‌ ఒప్పుకున్నాను. నేను చేయబోయే హిందీ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. నేను సౌత్‌లో చేయబోయే ప్రాజెక్ట్స్‌ గురించి త్వరలో చెబుతాను.

More Related Stories