English   

నాగ్ సినిమాలో తేజూ హీరోయిన్...ఆ సీన్స్ కోసమే 

Saiyami Kher
2020-01-27 10:55:32

మన్మథుడు 2 అనే భారీ డిజాస్టర్ తర్వాత నాగార్జున గ్యాప్ తీసుకుని  ‘వైల్డ్ డాగ్’ అనే పోలీస్ సినిమాతో వస్తున్నాడు. కొత్త నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాని అహిషోర్ సాల్మన్ నూతన ద‌ర్శక‌త్వంలో తెరకేక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో నాగార్జున ఒక ఏసీపీగా నటిస్తుండగా ఓ కీలక పాత్రలో  హిందీ నటీ సయామీ ఖేర్ నటించనుంది. ఈ భామ ఇంతకు ముందు సాయి ధరమ్ తేజ్ డెబ్యూ మూవీ అయిన రేయ్ లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. 

అయితే ఆ సినిమా మరే తెలుగు సినిమాలో నటించలేదు. అలా చాలా ఏళ్ళ తర్వాత సయామీ నాగార్జున సరసన ‘వైల్డ్ డాగ్’లో నటిస్తోంది. నిజానికి నాగ్ సరసన ఓ హీరోయిన్‌గా దియా మిర్జా నటిస్తుండగా మరో హీరోయిన్‌గా సయామీని తీసుకున్నారు. అయితే సయామీ మీద హై యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్ చేశారట. సయామీ 'రా' ఏజెంట్ పాత్రలో కనిపించనున్నది. దీనికోసం ఇప్పటికే ఆమె ముంబైలో శిక్షణ తీసుకుంటున్నారని చెబుతున్నారు. 

నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్‌ డాగ్ విజ‌య్ వ‌ర్మ పాత్రలో అక్కినేని నాగార్జున నటిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూలు పూర్తయిన ఈ సినిమా తదుపరి షెడ్యూలులో సయామీ నటించనుంది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7'కు పనిచేసిన డేవిడ్ ఇస్మాలోన్ 'వైల్డ్ డాగ్'కు యాక్షన్ డైరెక్టరుగా పనిచేస్తుండటం ఈ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.

More Related Stories