English   

సాక్ష్యం అందుకుంటుందా లక్ష్యం..?

sakshyam
2018-07-29 16:04:05

ప్రతీసారి వచ్చే సమస్యే మరోసారి వచ్చింది బెల్లంకొండ శ్రీనివాస్ కు. ఈ సారి కూడా ఈయనకు భారీ లక్ష్యం భయపెడుతుంది. హీరోగా ఈయన ఇప్పటికే పాస్ మార్కులు వేయించుకున్నాడు. మాస్ ఫాలోయింగ్ కూడా సూపర్ గా వచ్చేసింది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పటికీ చాలా మంది కుర్ర హీరోలకు తొలిరోజు 3.5 కోట్ల షేర్ రావడం కష్టంగానే ఉంది. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ప్రతీ సినిమాతో తొలిరోజే 3 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా సాక్ష్యం తొలిరోజే 3.8 కోట్ల షేర్ వసూలు చేసింది. నాగచైతన్య లాంటి హీరోలకు కూడా ఇంత వసూళ్లు రావు. వాళ్లింకా 2 కోట్ల రేంజ్ లోనే ఉన్నారు. కానీ బెల్లంకొండ మాత్రం అందర్నీ దాటేస్తున్నాడు. ఒక్కో సినిమా వస్తుంటే ఈయన రేంజ్ కూడా మారిపోతుంది. కానీ ఏం చేస్తాం.. సినిమాలే సరైనవి పడటం లేదు. ఇప్పుడు కానీ సాక్ష్యం సూపర్ హిట్ అయ్యుంటేనా కచ్చితంగా బెల్లంకొండ రేంజ్ మారిపోయుండేది. అయితే అది జరగలేదు. 

శ్రీవాస్ మరోసారి రొటీన్ స్క్రీన్ ప్లేతో బెల్లంకొండ కొంప ముంచాడు. కథ పరంగా సాక్ష్యం అధ్భుతంగా ఉన్నా.. అసలైన టేకింగ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేసారు. దాంతో మరోసారి ఈ చిత్రంతో యావరేజ్ దగ్గరే ఆగిపోయే ప్రమాదం వచ్చింది. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 25 కోట్లు రావాలి. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే 20 కోట్లు కూడా వస్తాయా రావా అనేది అర్థం కావడం లేదు. తొలి మూడు రోజుల్లో కచ్చితంగా 9 కోట్ల వరకు షేర్ వచ్చేలా కనిపిస్తుంది. నాని రేంజ్ ఇది.. హీరోగా బెల్లంకొండ దున్నేస్తున్నాడు. సినిమా సినిమాకు బాగానే మెరుగు అవుతున్నాడు. కానీ మంచి సినిమాలే పడటం లేదు. ఒక్కటి కానీ బ్లాక్ బస్టర్ పడితే ఈ కుర్ర హీరో రేంజ్ ఏంటి అనేది తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూడటం తప్ప ఇంకేం చేయలేరు. 

More Related Stories