English   

 సాక్ష్యంకు భారీ డిమాండ్

sakshyam
2018-07-21 20:12:09

సాక్ష్యం.. ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్ బజ్ క్రియేట్ చేస్తోన్న సినిమా. అయితే లేటెస్ట్ గా వినిపిస్తోన్న ఓ వార్త మాత్రం ఈ అన్ని వార్తలను మించిపోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. వాటన్నిటినీ తలదన్నుతూ సాక్ష్యంను లీడింగ్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ హయ్యొస్ట్ రేట్ కు కొనుగోలు చేసింది. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ చాలా పెద్ద స్టార్స్ కే పరిమితమైన ఇలాంటి డీల్స్.. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి యంగ్ స్టర్ కు రావడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోన్నా.. అందుకు కారణం మాత్రం కంటెంటే అంటోంది బాలీవుడ్ మీడియా.. యస్.. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సాక్ష్యం సినిమాను ఊహించని  రేట్ కు కొనుగోలు చేసింది. ఈ రేట్ ఎంత అనేది మాత్రం బయటపెట్టడం లేదు.  కానీ ఇది ఖచ్చితంగా చాలా అంటే చాలా పెద్ద అమౌంట్ అనేది మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది.

సాక్ష్యం సినిమాకు నిర్మాత అభిషేక్ నామా. ఇతనికి బాలీవుడ్ లో చాలామందితో సత్సంబంధాలున్నాయి. వాటి వల్లే ఈ డీల్ వచ్చిందని చెప్పలేం. కానీ ఆ సంస్థ మాత్రమే కాదు.. రిలయన్స్, ఫాక్స్ స్టార్ వంటి సంస్థలు కూడా సాక్ష్యం థియేట్రికల్ రైట్స్ కోసం విపరీతంగా పోటీ పడ్డాయంటున్నారు. మరి ఇంత పోటీ పడటానికి కారణం ఏంటో తెలుసా..కంటెంట్.. యస్.. ఈ సినిమా కంటెంట్ వారికి విపరీతంగా నచ్చిందట. అందుకే అంత పోటీ పడ్డారు. బట్ ఫైనల్ గా ఈరోస్ ఇంటర్నేషన్ కు ఈ రైట్స్ అమ్మేశారని చెబుతున్నారు. 

ఏదేమైనా ఈ డీల్ తో దర్శకుడు శ్రీవాస్ తో పాటు హీరో శ్రీనివాస్ రేంజ్ కూడా మారిపోతుందంటున్నారు. కాకపోతే ఈ సినిమా హిట్ కావాలి. అయితే మాత్రం ఖచ్చితంగా వీరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు బాలీవుడ్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంటుందనేది నిజం. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతోంది. విడుదలకుముందు విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోన్న ఈ మూవీ విడుదల తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. 
 

More Related Stories