English   

సాక్ష్యం ఫస్ట్ డే సత్తా చాటింది

sakshyam
2018-07-29 18:58:16

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా సాక్ష్యం. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ బి సి సెంటర్స్ లో మాత్రం కాస్ దూకుడుగానే ఉంది సాక్ష్యం. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా పాయింట్ ఆకట్టుకునేలా ఉన్నా.. కథనం అలా లేకపోవడంతో కొంత మైనస్ గా మారింది.`అయినా మాస్ ను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఉండటంతో సాక్ష్యం మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సత్తా చాటింది. 

తొలి రోజు కలెక్షన్స్ పరంగా మూడు కోట్ల షేర్ వసూలు చేసింది సాక్ష్యం. శ్రీనివాస్ లాంటి కొత్త హీరో విషయంలో ఇవి పెద్ద కలెక్షన్స్ అనే చెప్పాలి. అయితే థియేట్రికల్ రైట్స్ తో కంపేర్ చేస్తే ఇంకాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేయాల్సి ఉంది. కానీ తొలి రోజు మార్నింగ్ షో  పడలేదు.. అలాగే ఓవర్శీస్ లో ప్రీమియర్స్ కూడా పడలేదు. అవి సజావుగా పడి ఉంటే కలెక్షన్స్ ఇంకాస్త మెరుగ్గా ఉండేవని చెప్పొచ్చు. 
ఇక ఓవరాల్ గా మొదటి రోజు సాక్ష్యం కలెక్షన్స్ షేర్స్ రూపంలో చూస్తే ఇలా ఉన్నాయి..


నైజాం    - 1కోటి ఆరు లక్షలు
వైజాగ్     - 42లక్షలు
ఈస్ట్    - 27లక్షలు 
వెస్ట్     - 17లక్షలు
కృష్ణా    - 19లక్షలు
గుంటూర్    - 50లక్షలు
నెల్లూర్    - 11లక్షలు
సీడెడ్    - 68లక్షలు

యూఎస్     - 10లక్షలు 
ఇతర రాష్ట్రాలు    - 30లక్షలు(ఎస్టిమేటెడ్)

టోటల్    - 3కోట్ల  80లక్షలు వసూలు చేసి ఫస్ట్ డే సత్తా చాటింది సాక్ష్యం.. 

More Related Stories