English   

బెల్లంకొండ కుర్రాడికి గట్టి దెబ్బ

Bellamkonda srinivas pooja Hegde
2018-07-26 15:51:34

బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యంకు రిలీజ్ కు ముందే పెద్ద షాక్. సెల్ఫ్ మిస్టేక్ తో ఎక్కడైతే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయో అక్కడే లాస్ అవబోతున్నాడీ కుర్రాడు. యస్.. బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ సాక్ష్యం కు గట్టి షాకింగ్ న్యూస్ ఇది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఓవర్శీస్ లో ఆడియన్స్ ఎక్కువగా చూసేదే ప్రీమియర్ షోస్. అక్కడ మాగ్జిమం కలెక్షన్స్ వచ్చేది కూడా ప్రీమియర్స్ ద్వారానే. కానీ సాక్ష్యంకు ప్రీమియర్ షోస్ పడే అవకాశాలు లేవు. అందుకు కారణం ఈ మూవీ టీమే కావడం ఆశ్చర్యం.

సాక్ష్యం సినిమాకు సంబంధించి సెన్సార్ కాస్త లేట్ అయింది. అందుకు కారణం ఈ మూవీలో యానిమల్స్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ఉండటం. అందుకు సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావడానికి లేట్ అయింది. ఆ కారణంగా సెన్సార్ అనుకున్న టైమ్ కు కాలేదు. దీంతో ఇప్పుడు యూఎస్ లో ప్రీమియర్స్ కోసం ఇన్ టైమ్ లో కంటెంట్ అందించలేకపోతున్నారు. దీనివల్ల సాక్ష్యంకు భారీ లాస్ రాక తప్పదు అంటున్నాడు ట్రేడ్ అనలిస్ట్ లు.

అదీ నిజమే.. ప్రీమియర్స్ ద్వారా వచ్చే టాక్ ను బట్టే అక్కడ ఏ సినిమా కలెక్షన్స్ అయినా ఆధారపడి ఉంటాయి. పైగా ప్రీమియర్స్ కోసం ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు ఆడియన్స్. మరి అవే లేకపోతే ఖచ్చితంగా వాళ్లు వేరే ఆప్షన్ చూసుకుంటారు. దీని వల్ల సాక్ష్యం కలెక్షన్స్ పై ప్రభావం కాస్త గట్టిగానే పడుతుందనుకోవచ్చు. మొత్తంగా సినిమాకు ప్రీ రిలీజ్ హైప్ భారీగా వచ్చిందనుకుంటే పాపం ఇలా ప్రీమియర్స్ రూపంలో వారికి గట్టి దెబ్బే తగిలింది.

More Related Stories