English   

స‌ల్మాన్ కు ప‌ర్మిష‌న్.. దేశం దాటేసాడు.. 

Salman-Bharat-malta

ఎంత పెద్ద స్టార్ అయినా న్యాయ‌స్థానం ముందు అంతా ఒక్క‌టే. ఈయ‌న హీరో అయితే అయ్యుండొచ్చు కానీ ఓ కేస్ లో దోషి. శిక్ష ప‌డిన దోషి. ప్ర‌స్తుతం బెయిల్ పై బ‌య‌ట ఉన్న దోషి. అందుకే స‌ల్మాన్ ఖాన్ ఏం చేసినా.. చేయాల‌న్నా కోర్ట్ అనుమ‌తి తీసుకోవాలి. అంతా న్యాయస్థానం క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గాలి. 20 ఏళ్ల కింద కృష్ణ‌జింకల‌ను వేటాడిన కేస్ లో ఈయ‌నకు ఈ మ‌ధ్యే 5 ఏళ్ల శిక్ష కూడా జోధ్ పూర్ కోర్ట్. ప్ర‌స్తుతం బెయిల్ పై బ‌య‌ట ఉన్నాడు. బ‌య‌ట ఉన్నా ఇప్ప‌టికీ కోర్ట్ స‌ల్మాన్ ను దోషీలాగే ట్రీట్ చేస్తుంది.  అందుకే కోర్ట్ అనుమ‌తి లేకుండా దేశం దాటి వెళ్ల‌కూడ‌దు. ఇప్పుడు ఈయ‌న భ‌ర‌త్ సినిమా కోసం దేశం దాటేసాడు. అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాలో క‌త్రినాతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కోసం మ‌ల్టా వెళ్లాడు స‌ల్మాన్ ఖాన్. దీనికోసం ప్ర‌త్యేకంగా కోర్ట్ కు విన‌తి ప‌త్రం పెట్టి.. అనుమ‌తి సంపాదించాడు. నెల రోజుల పాటు అక్క‌డే షూటింగ్ చేయ‌నున్నారు. ఒక‌వేళ కోర్ట్ అనుమ‌తి ధిక్క‌రించి.. ప‌ర్మిష‌న్ లేకుండా దేశం దాటితే మ‌రిన్ని ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తాయ‌ని స‌ల్మాన్ కు కూడా బాగా తెలుసు. ఈ షూటింగ్ కోసం ముందు కోర్ట్ అనుమ‌తి నిరాక‌రించినా కూడా ఆ త‌ర్వాత ఒప్పుకుంది. 

More Related Stories