English   

సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

Salman-Jail
2018-04-05 12:58:51

కృష్ణ జింకలను వేటాడిన కేస్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్దారించింది జోధ్ పూర్ కోర్ట్. వైల్డ్ లైఫ్ ప్రాటెక్షన్ యాక్ట్ సెక్షన్ 9, 51లను అనుసరించి జోధ్ పూర్ కోర్ట్ సల్మాన్ ను దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు ఆయనకు ఐదేళ్ల జైలు విధించింది. రెండేళ్ల జైలు అనగానే సల్మాన్ కంటే ఎక్కువగా ఆయన నిర్మాతలను బెంబేలెత్తిపోతున్నారిప్పుడు. సల్మాన్ ను నమ్ముకుని ఇప్పటికే కోట్లలో ఇన్వెస్ట్ చేసిన నిర్మాతలంతా లబోదిబో మంటున్నారు. ఈ కేస్ లో ఆయన పూర్తిగా జైలులోనే ఉంటాడా లేదా అన్నది అందరికీ తెలుసు. త్వరలోనే బెయిల్ పై వస్తాడు.కానీ కొన్ని ఆంక్షలుండే అవకావం ఉంది. నిజానికి ఈ కేస్ లో గరిష్టంగా ఆరేళ్లు, కనిష్టంగా ఒక యేడాది శిక్ష పడాలి. కానీ దోషులంతా పశ్చాత్తాపం చెందారనే కారణంగా కేవలం ఐదేళ్ల జైలు సరిపెట్టారు. అసలు ఈ కేస్ కు సంబంధించిన వివరాలేంటో చూద్దాం.. 

1998లో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, సోనాలీ బెంద్రే, నీలమ్ హమ్ సాథ్ సాథ్ హై అనే సినిమా షూటింగ్ కోసం జోధ్ పూర్ వెళ్లారు. అక్కడ ఉన్న అడవిలో ఓ రాత్రంతా వారు ఓ జిప్సీలో తిరుగుతూ వేట మొదలుపెట్టారు. కొన్ని కృష్ణ జింకలు కనిపించగానే వాటిని వెంటాడుతూ సల్మాన్ ఖాన్ జిప్సీ డ్రైవ్ చేశాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిరూపించాడు. అలాగే వాటికి అత్యంత సమీపంలోకి వెళ్లిన తర్వాత సల్మానే తుపాకీతో కాల్చాడు. రెండు కృష్ణ జింకలు అక్కడిక్కడే చనిపోయాయి. ఇది సల్మాన్ పై ఆరోపించిన నేరం. మధ్యలో ఈ కేస్ ను నీరు గార్చేందుకు, సల్మాన్ తో పాటు అతని సహనటులను తప్పించేందుకు చాలా ప్రయత్నాలే నడిచాయి. కానీ ఫైనల్ గా ఆరోపణలు నిరూపితం కావడంతో సల్మాన్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు.  

More Related Stories