English   

స‌ల్మాన్ ఖాన్.. 100 కోట్ల మిష‌న్..!

Salman-Khan

సల్మాన్ ఖాన్.. ఈ పేరు వింటే బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. అమీర్, షారుక్ ఎంత పెద్ద తోపు హీరోలైనా కావ‌చ్చు. కానీ ఇండియాలో మాత్రం కండ‌ల‌వీరుడిని కొట్టే హీరోనే లేదు. ముఖ్యంగా మాస్ లో ఈ హీరో ఫాలోయింగ్ చూస్తే మెంట‌ల్ వ‌చ్చేస్తుంది. వ‌సూళ్లు లేక చాలాచోట్ల మూత ప‌డిన సింగిల్ స్క్రీన్స్ ను వాంటెడ్ తో రీ ఓపెన్ అయ్యేలా చేసిన ఘ‌న‌త స‌ల్మాన్ దే. ఈ హీరో సినిమా విడుద‌ల‌య్యేదే ఆల‌స్యం తొలిరోజు తొలి షో చూడాల‌నుకునే అభిమానులు కోట్ల‌ల్లో ఉంటారు. సాక్షాత్తు దుబాయ్ షేకులు సైతం స‌ల్మాన్ అంటే ప‌డి చ‌చ్చిపోతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. బాలీవుడ్ లో మ‌రో రేర్ రికార్డ్ సాధించాడు స‌ల్మాన్. వ‌ర‌స‌గా 13వ సారి 100 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయాడు కండ‌ల‌వీరుడు. ఈ రికార్డ్ అందుకున్న ఏకైక హీరోగా చ‌రిత్ర‌లో నిలిచిపోయాడు. స‌ల్మాన్ తాజా చిత్రం రేస్ 3 మూడోరోజే 100 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది. రెమో డిసౌజా తెర‌కెక్కించిన ఈ చిత్రం తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ రంజాన్ సీజ‌న్ కావ‌డం.. మ‌రో సినిమా కూడా పోటీలో లేక‌పోవ‌డంతో రేస్ 3 బాక్సా ఫీస్ ద‌గ్గ‌ర సునామీ సృష్టిస్తుంది. మూడు రోజుల్లోనే 106 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. తొలిరోజు 29.. రెండు మూడు రోజుల్లో 38..39 కోట్లు క‌లెక్ట్ చేసింది రేస్ 3. సినిమాలో విష‌యం లేక‌పోయినా స‌ల్మాన్ ఉన్నాడు క‌దా అని ప్రేక్ష‌కులు చూసేస్తున్నారు. అది ఆయ‌న స్టార్ ప‌వ‌ర్. ద‌బంగ్ నుంచి మొద‌లుకొని రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగ‌ర్, ద‌బంగ్ 2, జైహో, కిక్, భ‌జ‌రంగీ భాయీజాన్, ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో, సుల్తాన్, ట్యూబ్ లైట్, టైగ‌ర్ జిందా హై సినిమాల‌తో వ‌ర‌స‌గా 12 సార్లు 100 కోట్ల క్ల‌బ్ లో చేరాడు స‌ల్మాన్. ఇప్పుడు రేస్ 3 నెంబ‌ర్ 13. మొత్తానికి రేస్ 3 దూకుడు చూస్తుంటే ఫ్లాప్ టాక్ తోనే సేఫ్ అయ్యేలా క‌నిపిస్తుంది. 

More Related Stories