English   

వామ్మో సల్మాన్ ఖాన్.. 

salman-khan
2018-05-07 13:13:03

ఏ సినిమా అయినా రిలీజ్ కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ చేసుకుంటుంది. కానీ సల్మాన్ ఖాన్ లాంటి హీరో ఉన్నప్పుడు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్ని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కావడమూ పెద్ద విషయమేం కాదు. కానీ ఆ బిజినెస్ రేంజే ఇప్పుడు హాటెస్ట్ టాపిక్ అవుతుంది. ఎందుకో తెలుసా.. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 190కోట్లు. వెరీ స్సైసీ డీల్ కదా. కానీ ఆ నిర్మాతలు ఈ డీల్ కు కూడా నో చెప్పారు. మరి ఈ సినిమా ఏంటో తెలుసా.. రేస్-3. గతంలో సైఫ్ అలీఖాన్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లో నటించాడు. ఆ రెండు భాగాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వస్తోన్న మూడో సీక్వెల్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. ఈ మూవీకే ఇప్పుడు 190కోట్ల ఆఫర్ వచ్చింది. అది కూడా కేవలం థియేట్రికల్ రైట్స్ కు మాత్రమే. అంటే ఇంకా శాటిలైట్, డబ్బింగ్ ఇలా ఇంకా చాలా ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా నిర్మాతలు ఈ డీల్ కు నో చెప్పారు. 

రేస్ -3 ప్రొడ్యూసర్స్ లో సల్మాన్ ఖాన్ కూడా ఒకడు. బాలీవుడ్ లో ఉన్న నాలుగు బిగ్గెస్ట్ కార్పోరేట్ సంస్థలు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. కానీ ఫైనల్ గా ఈరోస్ సంస్థ 190కోట్ల డీల్ కు వచ్చింది. అదే సమయంలో యశ్ రాజ్ సంస్థ కూడా పోటీలో ఉంది. బట్ వీళ్లు 190కే నో చెప్పారంటే ఇక యశ్ రాజ్ బరిలో ఉండదు కదా. కానీ సల్మాన్ సినిమాలంటే మామూలుగా యశ్ రాజ్ సంస్థ వదులుకోదు. అయినా ఇంత పెద్ద డీల్ వచ్చినా సల్మాన్ అండ్ టీమ్ ఎందుకు ఒప్పుకోలేదా అనేది ఇప్పడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. ఏదేమైనా సల్మాన్ ఈ సినిమా నుంచి మరింత ఎక్కువగా ఆశిస్తున్నాడనేది అర్థమైనా.. హాలీవుడ్ యాక్షన్ స్టంట్స్ ను కాపీ కొట్టే ఈ సినిమాకు ఇంత పెట్టడానికి వచ్చిన ఈరోస్ సంస్థది తెలివి తక్కువ తనం అని చాలామంది నెటిజన్స్ సెటైర్స్ వేస్తుండటం విశేషం. 

More Related Stories