English   

జై బోలో చైనా.. సుల్తాన్ కూడా సిద్ధం..!

Salman-Khan
2018-08-02 14:48:08

హాలీవుడ్ త‌ర్వాత అంత మార్కెట్ ఉన్న‌ది చైనాలోనే. అక్క‌డి సినిమాలు ఓ రేంజ్ లో వ‌సూలు చేస్తుంటాయి. పైగా 20 వేల థియేట‌ర్స్ ఉండ‌టంతో మంచి సినిమా కానీ ప‌డితే ఓ రేంజ్ లో వ‌సూళ్లు వ‌స్తాయి. ఒక్క‌సారి అక్క‌డ మార్కెట్ ఓపెన్ అయిందంటే హీరోల‌కు పండ‌గే. చైనా మార్కెట్ రుచి ఇప్ప‌టికే అమీర్ ఖాన్ కు బాగా ప‌రిచ‌యం. ఈయ‌న న‌టించిన పీకే, 3 ఇడియ‌ట్స్ అక్క‌డ విజ‌యం సాధించాయి. ఇక దంగ‌ల్ అయితే అక్ష‌రాలా 1200 కోట్లు క‌లెక్ట్ చేసింది. అయితే అక్క‌డ ట్యాక్స్ ప్ల‌స్ డిస్ట్రిబ్యూట‌ర్ షేర్ పోనూ మ‌న నిర్మాత‌ల‌కు వ‌చ్చింది కేవ‌లం 120 కోట్లే.. అది వేరే విష‌యం. కానీ వ‌సూళ్లైతే భారీగా వ‌చ్చాయి క‌దా అని ఇప్పుడు మిగిలిన వాళ్లు కూడా చైనా మార్కెట్ పై క‌న్నేసారు. 

ఆ త‌ర్వాత‌ సీక్రేట్ సూప‌ర్ స్టార్ కూడా చైనాలో కుమ్మేసింది. ఈ చిత్రం అక్క‌డ 800 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. భ‌జ‌రంగీ భాయీజాన్.. టాయ్ లెట్.. హిందీ మీడియం లాంటి సినిమాలు కూడా చైనాలో వంద‌ల కోట్లు వ‌సూలు చేసాయి. అమీర్ ఇచ్చిన ఉత్సాహంతోనే అంతా ఇప్పుడు చైనా దండ‌యాత్ర కు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు స‌ల్మాన్ సుల్తాన్ కూడా ఆగ‌స్ట్ 31న అక్క‌డ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే పోస్ట‌ర్స్ కూడా విడుద‌ల చేసారు. 2016లో ఇక్క‌డ విడుద‌లైన సినిమా 600 కోట్లు వ‌సూలు చేసింది. ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీగా సుల్తాన్ తెర‌కెక్కింది. చైనాలో ఎమోష‌న్స్ ఉంటే ఇట్టే క‌నెక్టవుతారు. పీకే.. దంగ‌ల్ లాంటి సినిమాలు అక్క‌డ చ‌రిత్ర సృష్టించ‌డానికి అదే కార‌ణం. 

ర‌జినీకాంత్ 2.0 చైనాలో ఏకంగా 15000 థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. ఇది నిజంగా ఓ రికార్డ్. 20000 థియేట‌ర్స్ ఉన్న చైనాలో 75 శాతం స్క్రీన్స్ లో 2.0నే వ‌స్తుంది. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలో కేవ‌లం అమీర్ ఖాన్ సినిమాల‌కు మాత్ర‌మే డిమాండ్ ఉంది. మ‌న రంగ‌స్థ‌లం సినిమాను కూడా చైనాలో విడుద‌ల చేయ‌బోతున్నారు. దాంతోపాటే ఇంకొన్ని సినిమాలు కూడా అక్క‌డ విడుద‌ల‌కు సిద్ధం అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు హిందీకి మాత్ర‌మే సాధ్య‌మైన చైనా మార్కెట్ మ‌న సినిమాల‌కు కూడా వ‌స్తుందేమో..? 

More Related Stories