English   

సీక్వెల్ గా చైతూ, శామ్ ల తొలిప్రేమకథ

nagachaitanya and samantha

నాగచైతన్య, సమంతల తొలిప్రేమకథకు సీక్వెల్ వస్తోంది. ఇద్దరికీ ఇదే ఫస్ట్ హిట్ కూడా. ఆ సినిమా తర్వాత శామ్ స్టార్ హీరోగా ఎదిగింది. కానీ చైతూ ఇంకా ఆ జర్నీలో ఉన్నాడు. ఈ లోగా ఎన్నో జరిగిపోయాయి. ఫైనల్ గా ఆ ప్రేమకథకు ఎండ్ కార్డ్ వేసి పెళ్లి పీటలెక్కిందీ జంట. మరి ఈ ఇద్దరి తొలిప్రేమకథ అంటే ఏ మాయ చేశావె అని వేరే చెప్పక్కర్లేదు కదా. యస్.. ఏ మాయచేశావెకు సీక్వెల్ చేస్తున్నట్టు డిక్లేర్ చేశాడు దర్శకుడు గౌతమ్ మీనన్.

కథలు చెప్పడంలో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ శైలివేరు. వాస్తవానికి దగ్గరగా.. అత్యంత స్టైలిష్ గా తన సినిమాలు రూపొందిస్తాడీ దర్శకుడు. 2010లో విన్నితాండై వరువాయ సినిమాతో సెన్షేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడీ మూవీకి సీక్వెల్ చేయబోతున్నాడు. తమిళ్ లో శింబు హీరోగా నటించాడు. ఈ మూవీకి సీక్వెల్ చేస్తున్నట్టు కన్ఫార్మ్ చేశాడు గౌతమ్ మీనన్. అప్పట్లో సెన్షేషనల్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ అంటే ఇప్పుడు ఎవరు చేస్తారా అనే డౌట్స్ కూ తెరదించాడు గౌతమ్. కొన్నేళ్ల క్రితం తన చెలి సినిమాతో మాధవన్ ను అమ్మాయిల హృదయాల్లో ప్రతిష్టించిన గౌతమ్ ఈ సీక్వెల్ లో మాధవన్ ను హీరోగా తీసుకోబోతున్నాడు. యస్.. తెలుగులో ఈ కథ సుఖాంతం అవుతుంది కానీ.. తమిళ్ లో కాదు. అంటే కార్తీక్ పాత్ర పెళ్లి కాకుండా అలాగే ఉండిపోతుంది. మరి ఇన్నాళ్ల తర్వాత అతనెలా ఉంటాడు అనే రూపానికి శింబుకు దగ్గరగా ఉంటాడు కూడా మ్యాడీ.

తమిళ్ లోనే కాదు.. కన్నడ, మళయాలం లో కూడా ఈ సీక్వెల్ తెరకెక్కించబోతున్నాడు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఈ సీక్వెల్ కు ఓకే చెప్పడం విశేషం. మళయాలంలో టోవినో థామస్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. గౌతమ్ ఏం చేసినా రెండు భాషల్లో ఒకేసారి చేస్తుంటాడు. అందువల్ల అతని సినిమాలు బాగా లేట్ అవుతుంటాయి. ఇక ఈ సీక్వెల్ కు కూడా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఏదేమైనా తెలుగులో శుభంకార్డ్ వేయడం వల్ల మనం ఆ సీక్వెల్ మిస్ అయ్యామనే అనుకోవాలి.

More Related Stories