English   

పాకిస్తాన్‌లో సామజవరగమనా.. శత్రుదేశాన్ని ఊపేస్తున్న బన్నీ.. 

 Samajavaragamana
2020-01-22 17:00:58

ఈ ప్రపంచంలో దేనికైనా కదిలించే శక్తి సంగీతానికి ఉంది అంటారు. రాళ్లు కూడా సంగీతంతో కరిగిపోతాయి అనే సామెత ఉంది. పాట నచ్చితే భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల అది వైరల్ అవుతుంది. గతంలో కొలవెరి డి, గంగ్నం స్టైల్ లాంటి పాటలు భాషతో సంబంధం లేకుండా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కొన్ని వేల పాటలు అలా మాయ చేసాయి. భాషతో అస్సలు పనిలేకుండా సంగీతం సంచలనాలు చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. 

అల వైకుంఠపురంలో సినిమాలోని సామజవరగమన పాట ఇదే మాయ చేస్తుంది. ఈ పాట తెలుగులో చార్ట్ బస్టర్ అయింది. విడుదలైన క్షణం నుంచి మాయ చేస్తూనే ఉంది. ఇప్పటికే కొన్ని కోట్ల మంది హృదయాలను తాకింది ఈ పాట. సామజవరగమనా పాట కేవలం మనదేశంలోనే కాకుండా మన శత్రుదేశమైన పాకిస్తాన్ లో కూడా బాగానే ఆదరిస్తున్నారు. అక్కడ కూడా ఈ సాంగ్ ఫీవర్ కనిపిస్తోంది. వాళ్లకు భాష అర్ధం కాకపోయినా కూడా ట్యూన్ బాగుండటంతో సామజవరగమన పాటకు బాగానే ఫ్యాన్స్ అయిపోయారు పాకిస్తాన్ యువత. ఈ పాటను వాళ్లు మళ్లీ మళ్లీ వింటూ పాడుకుంటున్నారు. 

అంతేకాదు సామజవరగమనా పాట కోసం వాళ్లు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు కూడా. పాకిస్తాన్ లో సాధారణంగా హిందీ పాటలు బాగా వింటారు. కానీ ఇప్పుడు మాత్రం బన్నీ పాట అక్కడ సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే కేరళలో సూపర్ ఫేమస్ అయిన బన్నీ సామజవరగమన పాటతో పాకిస్థాన్లో కూడా పాపులర్ అయిపోతున్నాడు. ఈ క్రెడిట్ ఖచ్చితంగా తమన్ కు ఇవ్వాల్సిందే. ఈ ఒక్క పాటతోనే సినిమాపై అంచనాలు పెంచేసాడు ఈ సంగీత దర్శకుడు. థమన్ అందించిన ఈ ట్యూన్ చాలా కొత్తగా ఉండటంతో పాటు ఆకట్టుకునే విధంగా ఉంది. 

దానికితోడు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ కూడా అంతే అద్భుతంగా కుదరడంతో పాట ఎవర్ గ్రీన్ హిట్ అయిపోయింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ సామజవరగమనా పాట ఫిదా అయిపోయాడు. దావోస్ మీటింగ్ కోసం వెళ్లిన కేటీఆర్ ఈ సాంగ్ ను వింటూ ఎంజాయ్ చేస్తున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు. మొత్తానికి బన్నీ పాట సంచలనాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కలెక్షన్స్ పరంగా కూడా అల వైకుంఠపురములో రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పటికే 143 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం 150 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. 

More Related Stories