English   

2018.. స‌మంత నామ సంవ‌త్స‌రం..

Samantha
2018-02-21 13:40:12

అవును.. ఇప్పుడు ఇదే జ‌ర‌గ‌బోతుంది. 2018 మొత్తాన్ని మొత్తంగా ద‌త్త‌త తీసుకోనుంది స‌మంత‌. ఈ ఏడాది ఒక‌ట్రెండు కాదు.. అర‌డ‌జ‌న్ కు పైగా సినిమాల‌తో సంద‌డి చేయ‌బోతుంది స‌మంత‌. త‌మిళ‌నాట విజ‌య్ సేతుప‌తితో న‌టిస్తోన్న సూప‌ర్ డీల‌క్స్.. విశాల్ ఇరుంబు తిరై సినిమాల‌ను ఇప్ప‌టికే పూర్తి చేసింది స‌మంత‌. ఈ రెండు సినిమాలు త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి. తెలుగులోనూ బిజీగానే ఉంది స‌మంత‌. ఇక్క‌డ సావిత్రి బ‌యోపిక్ లో మ‌హాన‌టిలో జమున పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ పాత్ర షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. శివ‌కార్తికేయ‌న్ తో న‌టిస్తున్న సినిమా షూటింగ్ కూడా దాదాపు చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ ఏడాది స‌మ్మ‌ర్ లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. పైగా ఈ మ‌ధ్యే రంగ‌స్థ‌లంలోనూ త‌న పాత్ర‌ను పూర్తి చేసింది స‌మంత‌. ప్ర‌స్తుతం కాస్త రెస్ట్ మోడ్ లో ఉంది ఈ భామ‌. ఈ మ‌ధ్యే బికిని వేసుకుని అదిరిపోయే పోజ్ ఇచ్చింది ఈ మాయ‌లేడి. దీనిపై క‌మెంట్ చేసిన వాళ్ల‌కు తానేం చేయాలో త‌న‌కు తెలుసు.. స‌ల‌హాలు ఇవ్వ‌కండంటూ హాట్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది స‌మంత‌. ఇక ఇప్పుడు మ‌ళ్లీ యు ట‌ర్న్ సినిమాతో బిజీగా మారిపోయింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమాను ఇప్పుడు ప‌ట్టాలెక్కించింది స‌మంత‌. ఇది కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. మొత్తానికి ఓ ఏడాది ఖాళీగా ఉన్నా.. ఈ ఏడాది మాత్రం మొత్తం త‌నే క‌నిపించ‌బోతుంది..!

More Related Stories