English   

స‌మంత అక్కినేనిని చూసి ఏడుస్తున్న స్టార్ హీరోయిన్లు..

samantha
2019-07-16 20:18:54

సమంతని చూసి స్టార్ హీరోయిన్లు ఏడుస్తున్నారు ఇప్పుడు. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. ఎందుకంటే పెళ్లి తర్వాత కూడా ఈ స్థాయిలో కెరీర్ కొనసాగించడం అనేది ఒక సమంతకు తప్ప దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కు సాధ్యం కాలేదు. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత అక్కినేని ఇప్పటికీ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా సినిమాకు దాదాపు రెండు కోట్ల తీసుకుంటూ మిగిలిన హీరోయిన్ లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కాజల్, తమన్నా, శృతిహాసన్ లాంటి హీరోయిన్లు ఇప్పటికి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే.. స‌మంతకు మాత్రం దర్శక నిర్మాతలు ఏరికోరి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. దానికి తోడు పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోలు నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సమంత మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు అడుగులేస్తుంది.
ఇప్పటికే యూటర్న్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సమంత ఈ మధ్య ఓ బేబి సినిమాతో కమర్షియల్ హిట్ కూడా కొట్టేసింది. దాంతో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ఉందని చెబుతుంది స్యామ్. ఓ బేబీ సినిమా చేస్తున్నప్పుడే నందినీరెడ్డి.. సమంత కోసం ఓ కథ సిద్ధం చేసిందని.. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ఈ సినిమాను నాగచైతన్య నిర్మించబోతున్నాడనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. ఇప్పటినుంచి లేడీ ఓరియెంటెడ్ కథల వైపే సమంత అడుగులు పడనున్నాయి. కమర్షియల్ సినిమాల్లో చేస్తే ఖచ్చితంగా గ్లామర్ షో చేయాల్సి వస్తుంది. అది చేస్తే అక్కినేని అభిమానులకు నచ్చడం లేదు. అందుకే బయట ఎలా ఉన్నా కూడా సినిమాల పరంగా మాత్రం లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లకు ఓకే చెబుతుంది సమంత అక్కినేని. ఒకప్పుడు అనుష్క, నయనతార ఇలాంటి కథలు ఎక్కువగా చేసే వాళ్ళు. ఇప్పుడు ఆ స్థానాన్ని సమంత తీసుకుంటుంది. దాంతో ఈమె క్రేజ్ చూసి నిజంగానే మిగిలిన హీరోయిన్లు కుళ్లుకుంటున్నారు.

More Related Stories